Friday, 20 November 2026

కరీంనగర్

ఇళ్లపైనుంచి హైటెన్షన్‌వైర్లు తొలగించాలని ధర్నా

కరీంనగర్‌: ధర్మారం మండలంలోని మేడారం గ్రామాస్థులు విద్యుత్‌ తీగలు పదేపదే తెగిపడుతుండటంతో భయంభయంగా ఉంటున్నామని ఇళ్లపైనుంచి హైటెన్షన్‌ వైర్లను తొలగించాని డిమాండ్‌ చేస్తూ ధరన్మారం-పెద్దపల్లి రహదారిపై ధర్నా చేశారు. ప్రమాదకరంగా ఉన్న తీగలను తొలగిస్తామని విద్యుత్‌ ఏడిఈ శ్రీనివాస్‌…

గంగాధరలో వ్యవసాయ బావిలో కొండచిలువ

కరీంనగర్‌: గంగాధరలో దోడ్ల పరశురాముడు అనే రైతుకు చెందిన వ్యవసాయ బవిలో కొండచిలువ పడింది. బావిలో విద్యుత్‌ మోటరు తీయడానికి ప్రయత్నించగా కొండచిలువపడింది. దీన్ని వలలతో పైకి తీసి చంపివేశారు. ఆరడుగుల పోడవుంది.

గంగాధరలో ఏబీవీ ఆద్వర్యంలో రాస్తారోకో

కరీంనగర్‌: కేంద్ర ప్రభుత్వ అవినీతికి పాల్పడుతుందని గంగాధరలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తీరోకో నిర్వహించారు. దీంతో కరీంనగర్‌-జగిత్యాల రహదారిపై వాహనాలు నిల్చిపోయాయి దీంతో పోలీసులు చెదరగోట్టారు.

బొరిగిపల్లిలో ఆటోబోల్తా

కరీంనగర్‌: హుస్నాబాద్‌ మండలంలోని బొరిగిపల్లి వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడి 8మందికి తీవ్ర గాయాలయినాయి. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు.

తోటి విద్యార్థినుల వేదింపుతో విద్యార్థిని ఆత్మహత్య

కరీంనగర్‌: గోదావరిఖనిలోని ఐబీ కాలనీకి చెందిన గర్రెపెల్లి సుప్రియ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. తోటి విద్యార్థినులు తరచు వేదింపులకు గురి చేయటంతో తీవ్ర మానసికవేదనకు గురై మంగవారం బలవన్మరణానికి పాల్పడింది. విద్యార్థి తండ్రి లక్ష్మయ్య…

గోదావరిఖనిలె డేంగితోతో మృతి

కరీంనగర్‌: గోదావరిఖనిలోని తిరుమలలనగర్‌లో నామని అజయ్‌(21)డేంగీతో మృతి చెందాడు. కరీంనగర్‌ ఆసుపత్రిలో చికిత్స పోందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచాడు.

తెలంగాణకోసం ఆత్మహత్య చేసుకున్న న్యాయవాదికి సంతాపంగా న్యాయవాదుల విధుల బహిష్కరణ

కరీంనగర్‌: ప్రత్యేక తెలంగాణ కోసం వరంగల్‌లో ఆత్మహత్య చేసుకున్న న్యాయవాది సుమన్‌కుమార్‌కు సంతాప సూచకంగా గోదావరిఖని న్యావాదులు కోర్టునుంచి ప్రధాన చౌరస్తా వరకు మౌనప్రదర్శన నిర్వహించారు.

ఇద్దరు చిన్నారుల ఆత్మహత్యయత్నం

రామగుండిం: రామగుండంలోని మానస,నవీన్‌, పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. తల్లి చనిపోవటంతో తండ్రి మరో మహిళను వివాహం చేసుకున్నాడు. దీంతో చిన్నారులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు గమనించి గోదావరిఖని ఆసుపత్రికి తరలించారు.

భూపాలపల్లి గ్రామంలో గ్రంథాలయం ప్రారంభ:

చోప్పదండి: భూపాలపల్లి గ్రామంలో మినీ గ్రంథాలయాన్ని ఏఎస్‌ఐ మధుసూధన్‌రెడ్డి ప్రారంభించారు. గ్రంథాలయం యువతలోని సృజనాత్మకతను వెలికి తీయటానికి ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు.

పోలాలవద్దకు వెళ్లే దారి కబ్జా

కరీంనగర్‌: గంగాధర మండలం తాడాజెర్రి గ్రామంలో వ్యవసాయ రైతులు పోలం వద్దకు వెళ్లే రహదారిని కబ్జా చేసి దున్నారని రైతులు ఈరోజు అధికారులకు ఫిర్యాదు చేశారు. రహదారి దున్నటంతో పంటపోలాల వద్దకు వెల్లటానికి ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు.…