Thursday, 12 November 2026

మెదక్

6ప్రధాన సమస్యలపై చర్చా సమ్మెళనం-హాజరవనున్న గడ్కారీ

సిద్దిపేట: ఉత్తర తెలంగాణా జిల్లాలోని 6ప్రధాన సమస్యలపై చర్చించటానికి సెప్టెంబర్‌ 16వ తేదిన కరీంనగర్‌ చర్చా సమ్మేళనాన్ని ఏర్పాటు చేసామని ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ గడ్కారి హాజరవుతారని స్వదేశీ జాగరణ మంచ్‌ రాష్ట్ర కో-కన్వీనర్‌…

ఫీజులపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలి:నారయణ

సిద్దిపేట: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారయణ సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ విద్యార్థుల బోధనారుసుంపై సెప్టెంబర్‌ 3లోగా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.

పారిశుధ్య పనులు చేపట్టకపోవటంతో సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆర్డీవో

సిద్దిపేట: కొమతిచెరువు సమీపంలోని తారకరామారావు కాలనీలో ఆర్డివో నిఖిల తనిఖీలు చేపట్టారు. పారిశుధ్య పనులు చేపట్టకపోవటంతో సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణం పనులు చేపట్టాలని సిబ్బందిని డిమాండ్‌ చేశారు.

రుసుముల చెల్లింపులపై నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలి: నారాయణ

మెదక్‌: ఇంజినీరింగ్‌ బోధనా రుసుం అంశంపై ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీనీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్‌ వ్యక్తం చేశారు. తెలంగాణ పోరు యాత్రలో భాగంగా మెదక్‌ జిల్లాలో  నారాయణ  పర్యటిస్తున్నారు. పేద విద్యార్థులపై ఫీజు…

పరిశ్రమలు స్థాపించని భూముల్ని వెనక్కి తీసుకోవాలి

సంగారెడ్డి: ప్రభుత్వం కేటాయించిన భూముల్లో పరిశ్రమలు స్థాపించని వాటిని వెనక్కి తీసుకోవాలని శాసన సభ ప్రజాపద్దుల సంఘం చైర్మన్‌ రేవూరి ప్రకాశ్‌రెడ్డి డిమండ్‌ చేశారు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో భూములను కేటాయించిందో ఆ లక్ష్యం నెరవేరలేదని పేర్కోన్నారు. ఏపీఐఐసీ…

బీహెచ్‌ఈఎల్‌లో కాంట్రాక్ట్‌ కార్మికుల మెరకు సమ్మె

మెదక్‌: జిల్లాలోని బీహెచ్‌ఈఎల్‌ రామచంద్రాపురం యూనిట్‌లో రెండు వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. తనిఖీల పేరుతో కాంట్రాక్ట్‌ మహిళా ఉద్యోగులను సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బింది వేధిస్తున్నారని ఆరోపించారు. మహిళలను వేధించిన సిబ్బందిని తొలగించే వరకు సమ్మె…

నేడు మెదక్‌ జిల్లాలో పీఏసీ కమిటీ పర్యటన

మెదక్‌: ఈ రోజు శాసనసభా ప్రజా పద్దుల సంఘం మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలం కొత్లాపూర్‌లో పర్యటించనుంది. జిల్లాలో దళితులకు పంచిన భూములు అన్యాక్రాంతం అయిన విషయంపై ఈ కమిటీ విచారణ చేపట్టనుంది.  

పంచాయితి కాంట్రాక్ట్‌ కార్యదర్శుల మౌన ప్రదర్శన

మెదక్‌: క్రమబద్దీకరణ చేయాలంటూ కాంట్రాక్ట్‌ పంచాయితి కార్యదర్శులు కలెక్టరెట్‌నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు మౌన ప్రదర్శన నిర్వహించారు. తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని సంఘం నాయకులు తెలిపారు.

ఒడిశా కార్మికులను నిర్భందించిపనిచేయించుకుంటున్న యాజమానిపై కేసు-కార్మికులకు విముక్తి

మెదక్‌: రామచంద్రాపురం మండలం వెలిమలలో 43మంది ఒడిశా కార్మికులకు అధికారులు విముక్తి కల్గించారు. వారిని బలవంతంగా నిర్భందించి పనిచేయించుకుంటున్న కేఎంఆర్‌ ఇటుకల బట్టీ యజమానిపై కేసు పెట్టారు. రెవెన్యూ, కార్మికశాఖ అధికారులు కార్మికులను ఒడిశాకు తరలించే ఎర్పాటు చేస్తున్నారు.

గంజాయి తోటలపై దాడులు

మనూరు: మెదక్‌ జిల్లా మనూరు మండలంలోని మావినెల్లి పంచాయతీ పరిధిలో సక్రునాయక్‌ తండాలో పోలీసులు దాడులు నిర్వహించి గంజాయి తోటలను ధ్వంసం చేశారు. దీని విలువ మూడు కోట్లు ఉంటుందని ఎస్‌ఐ తెలియజేశారు. గ్రామాల్లో ఇంకా గంజాయి సాగుచేస్తున్న…