9న రాష్ట్రబంద్‌కు జీజేపి విలుపు
: విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా ఈ నెల 9నబీజేపి రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. విద్యుత్ ఛార్జీలు తగ్గించేవరకు పోరాటాన్ని ఉదృతం చేస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు.
: విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా ఈ నెల 9నబీజేపి రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. విద్యుత్ ఛార్జీలు తగ్గించేవరకు పోరాటాన్ని ఉదృతం చేస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు.
నిజాంపట్నం, జనంసాక్షి: అదుపుతప్పిన ఓ ప్రైవేటు పాఠశాల బస్సు వంతెనను ఢీకొన్న ఘటన గుంటూరు జిల్లా నిజాంపట్నంలో ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మందికి పైగా విద్యార్థులున్నారు.…
హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై వామపక్ష పార్టీలు గురువారం ఉదయం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ సమావేశానికి సీపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు,సీపీఐ కార్యదర్శి నారాయణ లు…
వరంగల్: కాకతీయ యూనివర్శిటీలో గురువారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. మెస్‌ల ప్రవేటికరణను నిరసిస్తూ వారు ఈ రోజు ఉదయం అల్వాహారం బహిష్కరించారు. పిహెచ్‌డీ విద్యార్ధులు యూనివర్శిటీని మూసివేయించారు.
కులకచర్ల, జనంసాక్షి: పొలానికి వెళ్లి ఇంటికి తిరిగివస్తుండగా ఇద్దరు విద్యార్థులు పాముకాటుకు గురైన సంఘటన రంగారెడ్డి జిల్లా కులకచర్ల మండలం పరిధిలో పుట్టపహాడ్‌లో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇంటర్ విద్యార్థి శివకుమార్ మృతిచెందగా, ఎనిమిదో తరగతి…
మహాబూబ్‌నగర్ : సడక్ బంద్ కేసులో తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరాం, టీఆర్‌ఎస్ నేతలు ఈటెల రాజేందర్ , జితేందర్‌రెడ్డిలు గురువారం అలంపూర్ కోర్టుకు హాజరయ్యారు. హైదరాబాద్ -కర్నూల్ జాతీయ రహదారిపై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్‌ఎస్…
సదాశివపేట, జనంసాక్షి: మెదక్ జిల్లా సదాశివపేటలోని గ్రంథాలయంలో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రంథాలయంలోని విలువైన పుస్తకాలు మంటల్లో కాలిబూడిదయ్యాయి.
హైదరాబాద్: రాష్ట్రం ఒక్కటే ..సీఎం ఒక్కడే ..కాని తెలంగాణ ప్రాంతం మాత్రం నష్టపోతుందని టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీష్‌రావు ఆగ్రహాం వ్యక్తం చేశారు. తెలంగాణలో వడగండ్ల వానతో రైతులు తీవ్రంగా నష్టపోయి రోడ్డు మీద పడితే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తి…
తిరుమల, జనంసాక్షి: శ్రీవారి ఆలయంలో ఈనెల 11న ఉగాది ఆస్థానం జరగనుంది. శ్రీవిజయనామ సంవత్సరం సందర్భంగా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు బంగారు వాకిలి చెంత ఆస్థానం, పంచాంగ శ్రవణ కార్యక్రమాలు జరగనున్నాయి. ఉగాది ఆస్థానం…
హైదరాబాద్ : చిక్కడపల్లిలో కల్తీ పాల ప్యాకెట్ల తయారి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పాల ప్యాకెట్లను కట్ చేసి పాలల్లో నీళ్లు నింపి రీ ప్యాకింగ్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలినట్లు సమాచారం.