నిజాంపట్నం, జనంసాక్షి: అదుపుతప్పిన ఓ ప్రైవేటు పాఠశాల బస్సు వంతెనను ఢీకొన్న ఘటన గుంటూరు జిల్లా నిజాంపట్నంలో ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మందికి పైగా విద్యార్థులున్నారు. నిజాంపట్నం నుంచి చెరకుపల్లి వెళ్తుండగా ముత్తుపల్లి, రెడ్లపాలెం గ్రామాల మధ్య మురుగుకాలువ వంతెనపై ఈ సంఘటన జరిగింది. బస్సు మురుగుకాలువలో పడితే పెనుప్రమాదం సంభవించేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.




