Tuesday, 17 November 2026

వార్తలు

గుడ్‌ఫ్రైడే సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు

ముంబై: గుడ్‌ఫ్రైడే సందర్భంగా శుక్రవారం బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌తో పాటు నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌, ఫారెక్స్‌. మనీ మార్కెట్లు సెలవు పాటించనున్నాయి. కానీ హోల్‌సేల్‌ కమోడిటీ, బులియన్‌ మార్కెట్లు యధావిధిగాయ పనిచేయనున్నాయి.

సీతారాముల కల్యాణం పోస్టర్‌ విడుదల

భద్రాచలం: భద్రచలం పుణ్యక్షేత్రంలో 19,20వ తేదీల్లో నిర్వహించనున్న సీతారాముల కల్యాణం, శ్రీరామపట్టాభిషేక వేడుకల వేదపండితుల మంత్రోచ్ఛారణల మద్య ఎమ్మెల్యే కుంజా సత్యవతి ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలలనుంచి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా  చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు…

31న రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ రాతపరీక్ష

హైదరాబాద్‌: సుదీర్ఘ విరామం అనంతరం ఎక్సైజ్‌ శాఖలో చేపడుతున్న కానిస్టేబుల్‌ నియామక ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈనెల 31న రాత పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12గంటలవరకు పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2604 పోస్టులకు…

ఉపాధ్యాయులు ఉగాది రోజున ‘స్పాట్‌’కు రావాల్సిందే

హైదరాబాద్‌: ఉగాది పర్వదినాన ఉపాధ్యాయుల సెలవుకు అధికారులు ‘స్పాట్‌’ పెట్టారు. ‘పండుగ… గిండుగ జాన్తానై, విధులకు హాజరుండి’ అని విద్యాశాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. సుమారు 15 వేల మంది ఉపాధ్యాచయులకు పదో తరగతి స్పాట్‌ వాల్యువేషన్‌ విధులు కేటాయించారు.…

నేడు టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ 32వ వ్యవస్థాపక దినోత్సవం ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో జరుగనుంది. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అలాగే అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో ఆయా పార్టీ కమిటీల ఆధ్వర్యంలో వ్యవస్థాపక…

లారీ-కారు ఢీ, ముగ్గురు మృతి

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా కొండ వద్ద ఈ రోజు తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. లారీ-కారు ఒకదానికొకటి ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు మహరాష్ట్రకు చెందిన శివరాజు, కీర్తి, అనిల్‌గా పోలీసులు…

ఒంగోలు జడ్జి ఇంట్లో పని చేస్తున్న అటెండర్‌ హత్య

ఒంగోలు , మార్చి 25: జిల్లా న్యాయమూర్తి జీ చక్రధర్‌రావు ఇంట్లో ఇద్దరు అటెండర్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఒకరి హత్యకు దారి తీసింది. న్యాయమూర్తి ఇంట్లో అటెండర్లగా పనిచేస్తున్న చల్లా సాంబశివరావు (32), దొమ్మేటి వెంక…

4,700 కోట్లతో పోస్టాపీసుల ఆధునీకరణ: కేంద్రమంత్రి కిల్లి కృపారాణి

శ్రీకాకుళం : దేశంలోని 1.55లక్షల పోస్టాపీసులను 4700కోట్లతో ఆధునీకరించ నున్నట్లు కేంద్రమంత్రి కిల్లి కృపారాణి తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 24కోట్లతో 220 పాఠశాలల్లో రాజీవ్‌గాంది ఐసీటి సేవలను విస్తరిస్తున్నట్లు ఆమె తెలిపారు.

తిరుమలలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

తిరుపతి : గుంటూరుకు చెందిన ఓ ప్రేమజంట తిరుమలలో ఆత్మహత్యాయత్నం చేసింది. మోకాళ్ల మెట్టు పర్వతం వద్ద ఆత్మహత్యకు పాల్పడుతున్న ప్రేమజంటను గుర్తించిన టీటీడీ సెక్యూరిటి సిబ్బంది అడ్డుకున్నారు. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. వీరు అచ్చంపేటకు…

నేడు ముగియనున్న జ్యోతుల పాదయాత్ర

జగ్గయ్యపేట : ఏలేరు ఆధునీకరణ కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత జ్యోతుల నెహ్రూె ఆధ్వర్యంలో వారం రోజుల నుంచి సాగుతున్న పాదయాత్ర నేడు ముగియనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉప్పాడ సెంటర్‌లో భారీ బహిరంగ…