Tuesday, 17 November 2026

వార్తలు

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి ఆరంభంలో సెన్సెక్స్‌ 45 పాయిట్లకుపైగా బాభపడింది. నిఫ్టీ 19 పాయింట్లకుపైగా లాభాంతో కొనసాగుంతోంది.

స్థానిక ఎన్నికల నిర్వహణకు చర్యలు : ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: స్థానిక సంస్థలకు 2001 జనాభా లెక్కల ఆధారంగానే ఎన్నికలు నిర్వహించేందకు ప్రభుత్వం చర్యలు చేపడేతుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. 2011 జనాభా లెక్కలు అందు బాటులోకి వచ్చేందుకు కచ్చితమైన సమయం తెలియ నందున దీనిపై తాము గతంలో…

అంబేద్కర్‌ యూనివర్శిరటీలో సహ చట్టంపై సదస్సు

హైదరాబాద్‌ : నగరంలోని బీఆర్‌ అంబేద్కర్‌ దూరవిద్య విశ్వవిద్యాలయంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు ప్రారంభమైంది. మూడురోజుల పాటు జరిగే ఈ సదస్సును రాష్ట్ర సమాచార కమిషన్‌ విజయబాబు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. సహ చట్టం లక్ష్యం…

రాజీనామాలు ఆమోదించమని కోరాం : గండ్ర

హైదరాబాద్‌ : పార్టీకి గుడ్‌బై చెబుతూ కొందరు ఎమ్మెల్యేల సమర్పించిన రాజీనామాలను వెంటనే ఆమోదించాలని సభాపతిని కోరునున్నట్లు ప్రభుత్వ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. అవిశ్వాస తీర్మానం విషయంలో తెరాస, వైకాపాల మధ్య రహస్య ఒప్పందం కుదిరినట్లు తమకు…

తెదేపా ఎమ్మెల్సీకి అస్వస్థత

హైదరాబాద్‌ : తెదేపా ఎమ్మెల్సీ పొగాకు యాదగిరి అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యమంత్రి ఛాంబర్‌కు వెళ్లిన ఆకస్మాత్తుగా కింద పడిపోయారు. దీంతో ఆయన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం : కేటీఆర్‌

హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. విపత్తు నిధుల్లో రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని అన్నారు.అసెబ్లీ ప్రాంగణంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి రూ.3,556 కోట్లు…

ఏసీబీకి అప్పగించిన తాడిపత్రి భూముల కేసు

తాడిపత్రి : అనంతపురం జిల్లా తాడిపత్రి పురపాలక సంఘంలోని భూముల వ్యవహారాన్ని ఏసీబీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జానీచేసింది. 25 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన వ్యవహారంపై ప్రభుత్వం స్పందించింది. పురపాలక సంఘం ఛైర్మన్‌ వెంకటరమణ…

నాగం, మోత్కుపల్లి మధ్య వాగ్వాదం

హైదరాబాద్‌ : అసెంబ్లీ ప్రాంగణంలో నాగం జనార్థన్‌రెడ్డి, తెదేపా ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్శింహులు మధ్య తెలంగాణ అంశంపై వాగ్వాదం జరిగింది. తెలంగాణ ప్రజలు అణగారిపోతుంటే చంద్రబాబును మోస్తున్నారంటూ మోత్కుపల్లిని నాగం దుయ్యబట్టారు. దీనికి స్పందించిన మోత్కుపల్లి తొమ్మిదేళ్లు మంత్రిగా…

రేపటికి వాయిదా పడిన శాసనసభ

హైదరాబాద్‌ : శాసనసభ రేపటికి వాయిదా పడింది. రెండు సార్లు వాయిదా వేసినప్పటికీ సభ సజావుగా సాగే సూచనలు కనిపిించకపోవడంతో స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని తెరాస, విద్యుత్‌ కోతలు తగ్గించాలని…

నిమ్మగడ్డ బెయిల్‌ పిటిషన్‌ వాయిదా

న్యూఢిల్లీ : చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌ బెయిల్‌ పిటిషన్‌ సుప్రీంకోర్టు ఏప్రిల్‌ మొదటి వారానికి వాయిదా వేసింది. జస్టిస్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని ధర్మాసనానికి నిమ్మగడ్డ కేసు బదలాయించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిజ్జర్‌ సూచించారు.