Monday, 16 November 2026

వార్తలు

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ.30,870లు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29, 800లుగా ఉంది. కిలో…

సహకార సంఘాల ఎన్నికల నోటిఫికేషన్‌ నిలుపుదల

హైదరాబాద్‌: సహకార సంఘాల ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రభుత్వం నిలుపుదల చేసింది. మంత్రి కాసుకృష్ణారెడ్డి ఆదేశాలతో ఆ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లను నోటిఫికేషన్‌ నిలుపుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

న్యూడెమోక్రసీ ఆఫీస్‌లో టీజేఏసీ భేటీ

హైదరాబాద్‌: న్యూడెమోక్రసీ ఆఫీసులో తెలంగాణ రాజకీయ జేఏసీ రౌండ్‌టేబుల్‌ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఉద్యోగ సంఘాల నేతలు, టీఆర్‌ఎస్‌, బీజేపీ, నాగం జనార్థన్‌రెడ్డి తదితర నేతలు హాజరై ప్రసంగిస్తున్నారు.

ముఖ్యమంత్రితో డీజీపీ భేటీ

హైదరాబాద్‌: సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో డీజీపీ దినేష్‌రెడ్డి భేటీ అయ్యారు. సమావేశంలో శాంతి భద్రతల పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.

లగడపాటి మాతో పెట్టుకోకు : మోత్కుపల్లి నర్సింహులు

నల్గొండ : కాంగ్రెస్‌ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ధ్వజమెత్తారు. పాదయాత్రను అడ్డుకునే దమ్ము లగడపాటికి లేదని, తమతో పెట్టుకుంటే అంతేనని ఆయన హెచ్చరించారు. లగడపాటికి మతి భమ్రించిందని ఆయన ఎద్దెవా చేశారు.

మెదక్‌ జిల్లా కోర్టుకు హాజరైన అసదుద్దీన్‌

సంగారెడ్డి : కలెక్టర్‌, జేఏసీలను దూషించిన కేసులో హైదరాబాద్‌ ఎంపీ ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ మెదక్‌ జిల్లా కోర్టులో ఈ ఉదయం హాజరయ్యారు. పటాన్‌చెరువు మండలం ముత్తంగిలో 2005 ఏప్రీల్‌ 16న మసీదు ఆవారా గోడ విషయంపై…

సహాకార సంఘాల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌: సహాకార సంఘం ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. రెండు దశల్లో పొలింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 31న మొదటి విడత ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 4 తేదిన రెండో దశ ఎన్నికలు జరుగుతాయని అధికారులు…

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో రెడ్‌ అలర్ట్‌

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఈ నెల 31వరకూ విజిటర్స్‌ పాసులను అధికారులు రద్దు చేశారు. రిపబ్లిక్‌ డే నేపథ్యంలో శంషాబాద్‌ విమాశ్రయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటలిజెన్స్‌ అధికారులకు సూచనలు అనుసరించి…

’28 లోగా తెలంగాణపై ప్రకటన చేయాలి’

హైదరాబాద్‌: ఈనెల 28లోగా తెలంగాణపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ రెడ్డి ప్రకటన చేయాలని బీజేపీ సీనియర్‌ నేత విద్యాసాగర్‌ రావు డిమాండ్‌ వ్యక్తం చేశారు. కేంద్రం ఈ విషయంలో వెనుకంజ వేస్తే తెలంగాణ ప్రజలే స్వాతంత్య్రం తెచ్చుకుని తీరుతారని…

లగడపాటి నివాసం వద్ద భారీగా పోలీసుల మోహరింపు

జగ్గయ్యపేట : సమైక్యాంధ్రకు చంద్రబాబు మద్దతు తెలపాలని కోరుతూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ కనువిప్పుయాత్రకు సిద్ధమవడంతో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.  ఈఉదయం అనుమంచిపల్లిలోని లగడపాటి బస చేసిన నివాసం వద్ద…