Monday, 16 November 2026

వార్తలు

రేపు ఢిల్లీ బాట పట్టనున్నా టీ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ టీ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు మంగళవారం ఢిల్లీ బాట పట్టనున్నారు. సీఎల్పీలో టీ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల భేటీ ముగిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మంత్రులు, ఎంపీలతో కలిసి అధిష్టాన పెద్దలను…

ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుపై సమావేశం

హైదరాబాద్‌: నగరంలోని జలసౌధలో ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు అంతరాష్ట్ర బోర్డు  తొలిసారిగా సమావేశమైంది. ఈ సమావేశానికి ఆంధ్రా – మహారాష్ట్ర ఇంజినీరింగ్‌ అధికారులు, కలెక్టర్లు హాజరయ్యారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్‌

హైదరాబాద్‌: సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మ్యాథ్యూతో కేంద్ర ఎన్నికల కమిషనర్‌ హెచ్‌, ఎస్‌, బ్రహ్మభేటీ అయ్యారు. భేటీలో ఓటరు నమోదు ప్రక్రియ, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా బ్రహ్మా మీడియాతో మాట్లాడుతూ… ఎమ్మెల్సీ…

అనుమంచిపల్లిలో లగడపాటి అరెస్టు

కృష్ణా : సమైక్యవాదానికి చంద్రబాబు మద్దతు తెలపాలని కనువిప్పు యాత్రకు సిద్దమైన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదయం అనుమంచిపల్లిలో లగడపాటి బస చేసిన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.…

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరాం : గాదె

న్యూఢిల్లీ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కాంగ్రెస్‌ పెద్దలను కోరినట్లు మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తెలిపారు. ఈ ఉదయం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌తో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. అనంతరం గాదె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని…

క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరిక అజరెంక

మెల్‌బోర్న్‌: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ విక్టోరియా అజరెంక ఆస్ట్రేలియా ఓపెన్‌ ఛాంపియన్‌షివ్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కి దూసుకుపోయారు. ఎలీనా వెస్నినాపై 6-1, 6-1 తేడాతో విజయం సాధించారు. బుధవారం మెల్‌బోర్న్‌లో జరగనున్న క్వార్టర్‌ ఫైనల్స్‌లో స్వెట్‌లేనాతో అజరెంకా తలపడనున్నారు.

తెలంగాణపై ప్రకటన షిండేనే చేస్తారు : దిగ్విజయ్‌

న్యూఢిల్లీ : తెలంగాణపై  నెలరోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చెప్పారని ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ దిగ్విజయ్‌సింగ్‌ గుర్తు చేశారు. దానికి అనుగుణంగానే తెలంగాణపై ప్రకటన కూడా షిండేనే చేస్తారని ఆయన చెప్పారు. తెలంగాణపై తమ…

సంగారెడ్డి కోర్టులో లొంగిపోయిన ఎంపీ అసదుద్దీన్‌

మెదక్‌ : ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఇవాళ సంగారెడ్డి కోర్టులో లొంగిపోయారు. 2005లో అప్పటి కలెక్టర్‌ అనీల్‌కుమార్‌ను దూషించిన కేసులో ఆయన విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యారు. అసదుద్దీన్‌ తరపు న్యాయవాదులు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

రాహుల్‌తో ఒరిగేదేమి లేదు : రాఘవులు

హైదరాబాద్‌  : చింతన్‌ శిబిర్‌ కాంగ్రెస్‌ చింతను తీర్చే విధంగా లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు విమర్శించారు. రాహుల్‌ను పార్టీలో మొదటి స్థానంలో కూర్చోపెట్టినా ప్రజలకు ఒరిగేదేమి లేదని మండిపడ్డారు. రాహుల్‌ ఆవేశం కుటుంబం గురించే తప్పా,…

సీఎల్పీలో తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు భేటీ

హైదరాబాద్‌: అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. భేటీలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశానికి లకాష్మరెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, భిక్షమయ్యగౌడ్‌, బాలానాయక్‌, ఆమోస్‌, మోహన్‌, అనీల్‌లు హాజరయ్యారు.