Monday, 16 November 2026

వార్తలు

మరికాసేపట్లో కాంగ్రెస్‌ మేధోమథన సదస్సు

జైపూర్‌ : 2014 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ మేథోమథన సదస్సులో పాల్గొనేందుకు నేతలు జైపూర్‌కు చేరుకుంటున్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు. సీనియర్‌ నేతలు, కేంద్ర మంత్రులు సమావేశ ప్రాంగణానికి వచ్చారు. మరికాసేపట్లో సోనియా…

55.68 లక్షల విలువగల గుట్కా నిల్వలు స్వాధీనం

గుంటూరు : రాష్టంలో గుట్కాలపై నిషేధం ఉన్నా భారీగా విక్రయాలు జరిపేందుకు గుంటూరు నగరంలో అక్రమంగా నిల్వచేసిన సరుకును విజిలెన్స్‌ ఎన్‌ఫోర్‌సమెంట్‌, ఆహారం తనిఖీ విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో భారీగా నిల్వలను గుర్తించారు.…

ప్రకృతివనరులను పొదుపుగా వాడుకోవాలి

హైదరాబాద్‌: ప్రకృతి వనరులను పొదుపుగా వాడుకోకపోతే ఇబ్బందులు తప్పవని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సునీల్‌శర్మ అన్నారు. హిందస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ చమురు, సహజవాయువు పరిరక్షణ పక్షోత్సవాలను నిర్వహింస్తోంది. ఇంధనాన్ని పొదుపుగా వాడుకోకపోతే భావి తరాలకు లభ్యత కష్టమని పక్షోత్సవాల…

దోషులను కఠినంగా శిక్షించండి : ఎమ్మెల్యే ఉషారాణి

రాజమండ్రి : తన కుమారుడి హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని పాలకొల్లు ఎమ్మెల్యే ఉషారాణి కోరారు. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కుమారుడి మృతదేహాన్ని చూసి ఎమ్మెల్యే కన్నీళ్ల పర్యంతమయ్యారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో తనయుడు జీవన్‌…

సీమంధ్ర నేతలు ఢిల్లీ యాత్రను విరమించుకోవాలి : హరీష్‌రావు

హైదరాబాద్‌ : సీమాంధ్ర నేతలు ఢిల్లీ యాత్రను విరమించుకోవాలని..యాత్రలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరని తెరాస ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. నీటి పంపకాలపై అనుమానాలు ఉంటే సీమాంధ్ర నేతలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. తెలంగాణకు అడ్డుపడితే వూరుకునేది లేదని…

తెలంగాణ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం: డీఎల్‌

హైదరాబాద్‌, (జనంసాక్షి): తెలంగాణపై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి డీఎల్‌ అన్నారు. తెలంగాణపై కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తెలంగాణ ఇస్తామని ఎవరు చెప్పారని, కొందరు అలా వూహించుకుంటున్నారని…

అమరజ్యోతి ర్యాలీని ప్రరంభించిన బాలకృష్ణ, లోకేశ్‌

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ 17వ వర్థంతి సందర్బంగా సినీ నటుడు బాలకృష్ట, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తనయుడు లోకేశ్‌ రసూల్‌పురాలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్‌ అమర జ్యోతి ర్యాలీని బాలకృష్ట, లోకేశ్‌…

సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నేతల ఆందోళన

హైదరాబాద్‌, (జనంసాక్షి): పబ్లిక్‌ గార్డెన్స్‌ వద్ద సదస్సుకు అనుమతినివ్వాలని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆందోళనకు దిగింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పలువురు విద్యార్థి ఐకాస నేతలను అరెస్టు చేశారు.