Monday, 16 November 2026

వార్తలు

కేకేతో కోదండరాం భేటీ

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె. కేశవరావుతో ఆయన నివాసంలో కోదంవడరాంతో పాటు పటువురు ఐకాశ నేతలు భేటీ అయ్యారు. తెలంగాణపై నిర్ణయం ప్రకటిస్తామని కేంద్రం వెల్లడించిన నేపధ్యంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

హర్యానా మాజీ సీఎంను దోషిగా తేల్చిన కోర్టు

న్యూఢిల్లీ: ఉపాధ్యాయుల అక్రమ నియామకాల కేసులో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలాను ఢిల్లీ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో చౌతాలాతో సహా ఆయన తనయుడు, ఎమ్మెల్యే అభయ్‌ చౌతాలాతో పాటు 53 మందిని దోషులుగా…

బోధనారుసుం, ఉపకారవేతనాల బకాయిల విడుదల

హైదరాబాద్‌: ఉపకారవేతనాలు, బోధనా ఫీజుల బకాయిలను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. రూ.1800 కోట్ల మేర ఉపకార వేతనాలు, బోధనాఫీజుల చెల్లింపునకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

పాక్‌ క్రీడాకారులను తొలగించిన హీకీ ఇండియన్‌ లీగ్‌

న్యూఢిల్లీ: హాకీ ఇండియన్‌ లీగ్‌ తొమ్మిది మంది పాకిస్తాన్‌ హాకీ క్రీడాకారులను మంగళవారం తొటగించింది. సరిహద్దుల్లో పాకిస్తాన్‌ సైన్యం దుశ్చర్యలకు బదులుగా పాక్‌ ఆటగాళ్లను తొలగించానట్లు ఇండియన్‌ లీగ్‌ ప్రకటించింది.

తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌

కొచ్చి: భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఇక్కడి జవహర్‌లాల్‌ నెహ్రౌ స్టేడియంలో రెండో వన్డే జరుగుతోంది.ఇంగ్లండ్‌ ఎనిమిది బంతుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. నాలుగు పరుగుల వద్ద ఇయాన్‌బెట్‌(1) ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కుక్‌, ప్రీటర్సన్‌ ఉన్నారు. ఇంగ్లండ్‌…

డీఎడ్‌ అభ్యర్థులకు ఉద్యోగాలివ్వండి

న్యూఢిల్లీ: డీఎస్పీ ఎంపికలో బీఈడీ, డీఎడ్‌ నిష్పత్తి వివాదం పరిష్కారమైందని సుప్రీంకోర్టు ప్రకటించింది. 2006,2008 నియామాకాల్లో అర్హత పొందిన అభ్యర్థులకు నేటి నుంచి 3 ఏళ్ల లోగా ఉద్యోగాలు ఇవ్వాలని ఆదుశించింది. వయోపరిమితి దాటిన వారిని కూడా పరిగణలోకి…

సీఎంను కలిసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: సచావాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై సీఎంకు వినతి పత్రం అందజేశారు. వైద్యశాఖలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సీఎంకు వివరించారు. గల్ఫ్‌ బాధితులను ఆదుకోవాలని సీఎం ను కోరారు.…

నల్లగొండ జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

నట్లగొండ: మఠంపల్లి మండలం వరదాపురంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాలు తెలియాల్సిఉంది.

పాక్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశ ప్రజలు ఇస్లామాబాద్‌లొ మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్‌ ప్రభుత్వం తక్షణమేవైదొలగాలని మత పెద్ద మహ్మద్‌ తహిర్‌-ఉల్‌ ఖాద్రి డిమాండ్‌ చేశారు. పాక్‌లో ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని…

బోధన ఫీజు చెల్లింపునకు చర్యలు

హైదరాబాద్‌: బోధన ఫీజుల చెల్లింపు, పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాల విడుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సాయంత్రం లోగా రూ.2వేల కోట్లు విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.