Sunday, 15 November 2026

వార్తలు

కల్మాడీపై అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: కామన్వెల్త్‌ కుంభకోణం కేసులో క్రీడల నిర్వాహక  కమిటీ మాజీ ఛైర్మన్‌ సురేష్‌ కల్మాడీతోపాటు మరో పది మందిపై అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. వీరిపై వంచన, ఫోర్జరీ , కుట్ర, అవినీతి నిరోధక చట్టం…

తెలుగు విజయ యాత్ర సైకిల్‌ ర్యాలీ ప్రారంభం

హైదరాబాద్‌: ప్రపంచ తెలుగు మహాసభలకు తెలుగు ప్రజలంతా హాజరై మాతృభాష వైభవాన్ని చాటి చెప్పాలని రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌ పిలుపునిచ్చారుజ ఆంధ్రప్రదేశ్‌ నాలెడ్జ్‌ నెట్‌ వర్క సంఘ:, అట్లాంటా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌…

డోర్నకల్‌ – గార్ల మధ్య విరిగిన రైలు పట్టా

వరంగల్‌: జిల్లాలోని డోర్నకల్‌ – గార్ల రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టా విరిగింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అధికారులు మరమ్మత్తులు చేపట్టినట్లు సమాచారం.

ముఖ్యమంత్రితో బొత్స భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో క్యాంపు కార్యాలయంలో పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. ఈ నెల 28న జరిగే అఖిలపక్ష సమావేశంపై చర్చించారు. రాష్ట్రంలో పార్టీ నిర్వహించే ప్రాంతీయ సదస్సుల నిర్వహణపై సమీక్షించారు.

పరువు నష్టం దావా కేసులో దిగ్విజయ్‌సింగ్‌కు బెయిల్‌

న్యూఢిల్లీ : పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నే దిగ్విజయ్‌ సింగ్‌కు వూరట లభించింది. భాజపా అధ్యక్షుడు గడ్కరీ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో దిగ్విజయ్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

ఆర్మీ వాహనం బోల్తా

రంగారెడ్డి : తాండూరు వైపు వెళ్తున్న ఆర్మీ వాహనం అనంతగిరి కొండల వద్ద లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పది మంది జవాన్లకు గాయాలయ్యాయి. వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు…

నెల్లూరులో మంత్రులను అడ్డుకున్న తెదేపా నేతలు

నెల్లూరు: విద్యుత్‌ సర్‌ఛార్జీల పెంపునకు నిరసనగా నెల్లూరులో తెదేపా ఆందోళనకు దిగింది, నగరంలో పలు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రులు ఆనం పితానిలను పినాకిని అతిథిగృహం వద్ద తెదేపా  కార్యకర్తలు అడ్గుకున్నారు. సర్‌ఛార్జీలు వెంటనే ఉపసంహరించాలని డిమాండ్‌ వ్యక్తం…

17వ రోజు టీఆర్‌ఎస్‌ పల్లెబాట

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ చేపట్టిన పల్లెబాట 17వ రోజుకు చేరింది. పల్లెబాటకు భారీ స్పందన లభిస్తోంది. గ్రామాల్లో గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. వీధుల్లో ‘ జై తెలంగాణ’ నినాదాలు మార్మోగుతున్నాయి. స్థానిక సమస్యల పరిష్కారానికే ప్రత్యేక రాష్ట్రంల కావాల్సిందేనని తెలంగాణవాదులు…

సాంకేతిక లోపంతో నిలిచిపోయిన విమానం

హైదరాబాద్‌: గురువారం రాత్రి సాంకేతిక లోపంతో కువైట్‌ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం నిలిచిపోయింది. దీంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఎయిరిండియా సిబ్బందిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి: శుక్రవారం స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో 100 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌ కొనసాగుతుండగా, 30 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ కొనసాగుతోంది.