Sunday, 15 November 2026

వార్తలు

గుజరాత్‌లో బీజేపీ హవా

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. 182 స్థానాలకుగాను 113 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అందరు అనుకున్నవిధంగానే నరేంద్రమోడీ హ్యాట్రిక్‌ దిశగా దూసుకువెళుతున్నారు. వరుసగా మూడోసారి నరేంద్రమోడీకి ఓటర్లు పట్టం కట్టారు. మణినగర్‌…

రియల్టర్ల ఇళ్లపై ఐటీ దాడులు

హైదరాబాద్‌: కూకట్‌పల్లి, నిజాంపేట్‌, భాగ్యనగర్‌ కాలనీలో రియల్టర్ల ఇళ్లపై ఐటీ దాడులు నిర్వహించింది. కార్పొరేటర్‌ సామ్రాజ్యం, రియల్టర్లు గాంధీ, సుబ్బయ్య, కోటేశ్వర్‌రావు ఇళ్లలో ఐటీ సోదాలు జరిపింది.

విమలక్కను విడుదల చేయాలి: మధుయాస్కీ

ఢిల్లీ: టఫ్‌ కోకన్వీనర్‌, అరుణోదయ విమలక్కను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ మధుయాస్కీ డిమాండ్‌ వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం గజ్జే కట్టి గళం విప్పిన విమలక్కను మూడు నెలలుగా జైల్లో బంధించండం దారుణమన్నారు.

అగ్నిప్రమాదంపై త్వరలోనే నివేదిక: కృష్ణారావు

హైదరాబాద్‌: బేగంపేట విమానాశ్రయం ఓ సంభవించిన అగ్నిప్రమాదంపై ప్రభుత్వానికి త్వరలోనే నివేదిక సమర్పిస్తామని విచారణ కమిటీ ఛైర్మన్‌ కృష్ణారావు తెలిపారు. ఈరోజు ఆయన ఘటనాస్థలాన్ని పరిశీలించారు. విచారణ కమిటీ అధికారులు ఈరోజు విమానాశ్రయ ప్రాంగణాన్ని కూలంకషంగా గాలించారు. ఆధారాలకోసం…

ఎమ్మార్‌ కేసులో ముగిసిన వాదనలు : తీర్పు రిజర్వులో

న్యూఢిల్లీ : ఎమ్మార్‌ ఆస్తుల ఎటాచ్‌మెంట్‌ వ్యవహారంలో న్యాయప్రాధికార సంస్థముందు వాదనలు ముగిశాయి, అయితే ఆస్తుల ఎటాచ్‌మెంట్‌ వ్యవహారంపై తీర్పును న్యాయప్రాధికార సంస్థ రిజర్వులో ఉంచింది. ఈడీ, ఎమ్మార్‌ కౌంటర్లపై లిఖిత పూర్వక సమాధానాలు ఇవ్వాలని న్యాయప్రాధికార సంస్థ…

కేంద్ర హోంమంత్రికి కిషన్‌రెడ్డి లేఖ

హైదరాబాద్‌: కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేకు కిషన్‌రెడ్డి లేఖ రాశారు. సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో వ్యవహరించి అఖిలపక్షం నిర్వహించాలని లేఖలో ఆయన కోరారు. సమావేశానికి సోనియా, చంద్రబాబు, వైఎస్‌ విజయ హాజరయ్యేలా  చర్యలు తీసుకోవాలన్నారు.

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టైన వైఎస్‌ జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈరోజు ఉదయం ఈ కేసును మధ్యాహ్ననికి వాయిదా వేసిన న్యాయస్థానం తిరిగి రేపటికి వాయిదా వేసింది.

లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశం రేపటికి వాయిదా పడింది. సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు యశ్‌వీర్‌ కేంద్రమంత్రి నారాయణస్వామి నుంచి కోటా బిల్లు ప్రతిని లాగేసుకున్నారు. ఆయన నుంచి బిల్లు ప్రతిని తిరిగి తీసుకునేందుకు సోనియా ప్రయత్నించారు. సోనియాకు అందకుండా యశ్‌వీర్‌…

నిందితుల రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: ఓఎంసీ, ఎమ్మార్‌, జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో జగన్‌, గాలి జనార్దన్‌రెడ్డి సహా నిందితులందరికీ సీబీఐ న్యాయస్థానం జనవరి రెండు వరకు రిమాండ్‌ పొడిగించింది. ఈ కేసుల్లో నిందితులను ఈ రోజు న్యాయస్థానం వీడియో కాన్ఫరెన్స్‌  ద్వారా విచారించింది.