Sunday, 15 November 2026

వార్తలు

వామపక్ష పార్టీల కోటి సంతకాల సేకరణ

హైదరాబాద్‌: సమర్థవంతమైన ఆహార భద్రత చట్టాన్ని రూపొందించాలని కోరుతూ వామపక్ష పార్టీలు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాయి. నారాయణగూడ కూడలి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు నారాయణ, రాఘవులు పాల్గోన్నారు. ఆహార…

త్వరలో రైలు ఛార్జీలు పెంచే ప్రతిపాదన : మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌

రాజమండ్రి : రైల్వే ప్రాజెక్టుల్లో మన రాష్ట్రానికి అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల  సూర్యప్రకాశ్‌ రెడ్డి అన్నారు. త్వరలో రైలు ఛార్జీలు పెంచే ప్రతిపాదన ఉందని ఆయన రాజమండ్రిలో వెల్లడించారు. రైల్వే…

అఖిలపక్ష సమావేశం పై 3 ప్రాంతాల నేతలతో భేటీ : బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: అఖిపలక్ష భేటీపై చర్చించేందుకు అన్ని ప్రాంతాల నేతలతో సమావేశం కానున్నట్లు పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ తెలియజేశారు. కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశం అనంతరం మూడు ప్రాంతాల భేటీ అయి అఖిలపక్ష సమావేశంలో  అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు చెప్పారు.

ఆజాద్‌తో భేటీ కానున్న తెలంగాణ ప్రాంత మంత్రులు

హైదారాబాద్‌: నగర పర్యటనకు వస్తున్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ గులాంనబీ ఆజాద్‌తో భేటీ కావాలని తెలంగాణ ప్రాంత మంత్రులు నిర్ణయించారు. ఈ సాయంత్రం సమన్వయ కమిటీ సమావేశం అనంతరం ఆజాద్‌తో భేటీ కానున్నట్లు మంత్రులు  తెలియజేశారు. …

13 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలో అటవీశాఖ అధికారులు 13 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 7 దుండగులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తమిళనాడు తిరువణ్టామలై వాసులుగా గుర్తించారు.

పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న నిందితుడి మృతి

ఉంగుటూరు : ఓ కేసులో నిందితున్ని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువస్తుండగా మార్గమధ్యలో మృతిచెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కైకరంలో అక్టోబర్‌ 12న ఓ వ్యక్తితో జరిగిన గొడవ కేసులో…

టెట్‌, డీఎస్సీలకు ఒకే పరీక్ష : మంత్రి పార్థసారధి

శ్రీకాళహస్తి : ఉపాధ్యాయ అర్హతలకు సంబంధించి ఇప్పటివరకు డీఎస్సీ, టెట్‌లకు వేరువేరుగా పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇకపై రెండూ కలిపి ఒకే పరీక్షగా నిర్వహించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థసారధి అన్నారు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శనార్థం శనివారం…

మహిళ గొంతు కోసిన దుండగులు

హైదరాబాద్‌ : నగరంలోని వనస్థలిపురంలో దుండగులు ఓ మహిళ గొంతుకోసి పరారయ్యారు. పట్టపగలే ఈ దారుణం చోటుచేసుకోవడంతో స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ దారుణానికి భూవివాదాలే కారణమని బంధువులు…

అసమానతలు తొలగించడం అంత తొందరగా కాదు : ప్రధాని

న్యూఢిల్లీ : పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ఇంకా కృషి చేస్తుందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ఢిల్లీలో ఫిక్కీ సదస్సును ప్రధాని ప్రారంభించి మాట్లాడారు. దేశంలో అసమానతలు రాత్రికి రాత్రే తొలగించడం అసాధ్యమని  చెప్పారు. మితిమీరిన నిరాశావాదమే అభివృధ్ధికి ఆటంకమని…

బొత్సతో తెలంగాణ మంత్రుల భేటీ

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రాంత మంత్రులు గాంధీభవన్‌లో పీసీసీ అధినేత బొత్స స త్యనారాయణతో భేటీ అయ్యారు. ఈనెల 28న జరిగే అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్‌ పార్టీ తరపున తెలంగాణకు అనుకూలంగా అభిప్రాయం చెప్పాలని మంత్రులు కోరారు.