Sunday, 15 November 2026

వార్తలు

ఢిల్లీ చాందినీ చౌక్‌లో భారీ అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ: ఢిల్లీలోని చాందినీ చౌక్‌ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 22 అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. చాందినీ చౌక్‌లోని విద్యుత్‌ ఉపకరణాలు అమ్మే భగరథ్‌ ప్యాలన్‌లలో అగ్నిప్రమాదం  సంభవించినట్లు పోలీసులు గుర్తించారు.

సౌదీ అరేబియాలో ‘అనంత’ వాసి మృతి

అనంతపురం: సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తలుపుల మండలం ఓబులరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీరాములు అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు లోనికి వచ్చింది. శ్రీరాములు మృతి చెందిన విషయం వారి యజమాని…

సమాధాన పత్రాల కుంభకోణం విచారణకు కమిటీ

హైదరాబాద్‌: సమాధాన పత్రాల కుంభకోణం పై విచారణ చేపట్టేందుకు కమిటీని నియమిస్తున్నట్లు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ రయణారావు తెలిపారు. ఈ కుంభకోణంలో పాత్ర ఉన్న విద్యార్థులను డీబార్‌ చేస్తామన్నారు. దీనిలో ఇంజనీరింగ్‌ కళాశాలల ప్రమేయముంటే వాటి గుర్తింపును రద్దు చేస్తామన్నారు.

సౌదీ అరేబియాలో ‘అనంత’ వాసి మృతి

అనంతపురం: సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తలుపుల మండలం ఓబులరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీరాములు అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు లోనికి వచ్చింది. శ్రీరాములు మృతి చెందిన విషయం వారి యజమాని…

ఆటో బోల్తా : 14 మందికి గాయాలు

మునగోడు : నల్లగొండ జిల్లా మునుగోడు శివారులో గురువారం ఉదయం ఆటో బోల్తా పడిన సంఘటనలో 14 మంది కూలీలు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పత్తి తీసేందుకు చిట్యాల మండలం నేరడ నుంచి మునుగోడు…

రాష్ట్రస్థాయి అంధుల క్రికెట్‌ పోటీలు ప్రారంభం

హైదరాబాద్‌ : రాష్ట్రస్థాయి అంధుల క్రికెట్‌ పోటీలు ఈరోజు సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. రెండు రోజల పాటు కొనసాగే ఈ పోటీల్లో అన్ని జిల్లాల నుంచి 16 జట్లు పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. గెలుపొందిన జట్లకు శుక్రవారం…

తెలంగాణ ఏర్పాటుకు అఖిలపక్షమే చివరి సమావేశం కావాలి

వరంగల్‌ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఈనెల 28న జరిగే అఖిలపక్ష సమావేశమే చివరిది కావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అఖిలపక్షం తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరారు. హన్మకొండలో పర్యాటక…

గాలి బెయిల్‌ ముడుపుల కేసు విచారణ 24కు వాయిదా

హైదరాబాద్‌: గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్‌ ముడుపుల కేసు విచారణను ఏసీబీ కోర్టుఈ నెల 24కి వాయిదా పడింది. ముడుపుల కేసు విచారణ నిమిత్తం గాలి జనార్ధన్‌రెడ్డిని తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటిించారు.

అఖిలపక్షానికి ఎవరిని పంపాలో నిర్ణయిస్తాం : ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : తెలంగాణపై ఈనెల 28న జరిగే అఖిలపక్షానికి ఎవరిని పంపాలో అనే విషయంపైఈనెల 22, 23న కరీంనగర్‌లో నిర్ణయిస్తామని తెలుగుదేశం నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. డెడ్‌లైన్లు పెట్టే అధికారం ఐకాసకు లేదని ఎర్రబెల్లి అన్నారు.

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ నేతలతో పీసీసీ చీఫ్‌ భేటీ

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా మంత్రులు, ఎమ్మెల్సీలతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ రోజు భేటీ అయ్యారు. ఈ నెల 16న జరిగే పార్టీ విస్తృతస్థాయి సమావేశంపై ఈ భేటీలో చర్చిస్తారు.