నేటి బులియన్ ధరలు
హైదరాబాద్: మార్కెట్‌లో ఈ రోజు బులియన్ ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం రూ. 31,440, 22 క్యారెట్ల బంగారం 29,450, వెండి కిలోరూ. 61,750గా ఉంది.
హైదరాబాద్: మార్కెట్‌లో ఈ రోజు బులియన్ ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం రూ. 31,440, 22 క్యారెట్ల బంగారం 29,450, వెండి కిలోరూ. 61,750గా ఉంది.
హైదరాబాద్: ఎమ్మార్ ఆస్తుల అటాచ్‌మెంట్‌పై ఈడీ న్యాయప్రాధికార సంస్థ ఈరోజు విచారణ చేపట్టింది.దీనికి ఎమ్మార్‌ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కేసులో త్వరగా కౌంటర్ దాఖలు చేసి ఈడీకి అందించాలని ఎమ్మార్‌ను న్యాయప్రాధికార సంస్థ ఆదేశించింది. సంస్థ ఆదేశాల మేరకు ఎమ్మార్…
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అక్రమాస్తుల కేసులో ఆయనపై సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ములాయం అక్రమంగా అస్తులు సమకూర్చుకున్నారని వచ్చిన అభియోగాలపై సీబీఐ విచారణ కొనసాగించాలని స్పష్టం చేసింది.…
ఢిల్లీ : ఆస్తుల కేసులో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్‌పై విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు ఈ రోజు తేల్చి చెప్పింది. ఆస్తుల కేసులో సీబీఐ విచారణను సవాలు చేస్తూ ములాయం దాఖలుచేసిన పిటిషన్‌ను ధర్మాననం తోసిపుచ్చింది. ఈకేసులో…
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ముగ్గురు మంత్రులు సీఎం క్యాంపు కార్యాలయంలో ఈరోజు భేటీ అయ్యారు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేష్ ఉన్నారు. పార్టీకి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం.
నాగ్‌పూర్: నాగ్‌పూర్ టెస్టులో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. ఈ సిరీస్‌లో అద్భుతఫామ్‌లో ఉన్న కెప్టెన్ కుక్ (1) జట్టుస్కోరు 16 పరుగుల వద్ద ఇషాంత శర్మ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.
కాజీపేట: వరంగల్ జిల్లా కాజీపేట బస్టాండు సమీపంలో ఈ రోజు ఉదయం మూడు రోజుల ఆడ శిశువును తల్లి వదిలివెళ్లింది. ఈ సంఘటనాస్థలానికి చేరుకున్న 108 సిబ్బంది శిశువును చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
హైదరాబాద్: జేఎన్‌టీయూలో సమధాన పత్రాల కుంభకోణం బట్టబయలైంది. ప్రశ్నా పత్రాలు ఇంటికే పంపి సమాధానాలు రాయిస్తున్న ముఠాపై సమాచారమందుకున్న పోలీసులు ముఠా సభ్యులపై నిఘా పెట్టారు. ఈకుంభకోణానికి సంబంధించి 13 మందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు.…
ఢిల్లీ: పార్లమెంటుపై దాడి కేసులో పట్టుబడి ఉగ్రవాది ఆఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు జాప్యంపై భాజపా లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌కు నోటీసు ఇచ్చింది. ఈ అంశంపై సభలో చర్చించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా భాజపా నోటీసులు పేర్కొంది.
హైదరాబాద్: బెయిల్ ముడుపుల కేసులో విచారణ నిమిత్తం గాలి జనార్థన్‌రెడ్డిని పోలీసులు ఈరోజు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.