Saturday, 14 November 2026

వార్తలు

ప్రపంచ తెలుగు మహాసభల ప్రాంగణాన్ని పరిశీలించిన సీఎస్‌

తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలంలో ఆవిలీల చెరువు వద్ద డిసెంబరులో జరుగనున్న ప్రపంచ తెలుగు మహాసభల పనులను గురువారం ప్రభుత్వం ప్రధాన కార్శదర్శి మిన్నీ మాధ్యూ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనులను ఆమెకు…

ఢీల్లీ ‘ రకాబ్‌ గంజ్‌ ‘ వద్ద కాల్పులు

ఢిల్లీ: ఢీల్లీలోని రకాబ్‌గంజ్‌ గురుద్వార వద్ద రెండు సిక్కువర్గాలమధ్య ఘర్షణ జరిగింది. తాల్వార్లతో పరస్పరదాడుల దిగుతుండటంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

వీసీ నియామకాన్ని తప్పు పట్టిన హైకోర్టు

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సీటీ వీసీ నియామకం పట్ట ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పుు పట్టింది. సెర్చ్‌ కమిటీ ఆదేశాల మెరకే వీసీని నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారినే ఈ యూనివర్సిటీకి వీసీ గా…

నేడు ఢిల్లీకి వెళ్లనున్న బొత్స

హైదరాబాద్‌: రాష్ట్రంలో నెలకోన్న రాజకీయ పరిస్థితులపై హస్తిన పెద్దలకు వివరించేందుకు ఇవాళ సాయంత్రం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎంఐఎం మద్దతు  ఉపసంహరణతో రాష్ట్రంలో నెలకోన్న రాజకీయాలపై చర్చించేందుకు బొత్సను ఢిల్లీకి రావాల్సిందిగా కాంగ్రెస్‌ పెద్దలు…

సెహ్వాగ్‌ దూకుడు

అహ్మదాబాద్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో సెహ్వాగ్‌ రెచ్చిపోయాడు. వన్డే మ్యాచ్‌ను తలపిస్తూ ఇంగ్లాండ్‌ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. వరుసగా విఫలమవుతున్న సెహ్వాగ్‌, గంభీర్‌ జోడి ఈ మ్యాచ్‌లో నిలకడగా ఆడుతోంది. మొదటి రోజు లంచ్‌ విరామానికి భారత్‌…

పాతబస్తీలో ఉద్రిక్తతతకు కారణం మజ్లిస్‌: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: పాతబస్తీలో ఉద్రిక్తత, సమస్యలు సృష్టించింది మజ్లిన్‌ పార్టీయేనని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. పాతబస్తీ ఘటనలతో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. గురువారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అర్థరాత్రి…

తెరాస గూటికి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి తెరాస గూటికి చేరారు. కేసీఆర్‌ కుమారుడు, ఎమ్మెల్యే కె.తారక  రామారావు సమక్షంలో తెరాస సభ్యతం తీసుకున్నారు.

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మార్కెట్‌లో గురువారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.31,120గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 29,900కాగా… కిలో వెండి ధర రూ. 61,500గా…

థీమ్‌ పార్కుల ఏర్పాటుతో పర్యాటకాభివృద్ధి: చిరంజీవి

గుంటూరు: ధీమ్‌ పార్కుల ఏర్పాటుతో పర్యాటకాభివృద్ధి జరుగుతుందరి కేంద్ర పర్యాటకశాఖ మంత్రి చిరంజీవి అన్నారు. గుంటూరు  జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలోని హాయ్‌ల్యాండ్‌ బుద్ధిజం ధీమ్‌ పార్కును గురువారం ఆయన సందర్శించారు. మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఇంకా…

పాల్వంచ కేటీపీఎస్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం: జిల్లాలోని పాల్వంచ కేటీపీఎస్‌ తొమ్మిదో యూనిట్‌లో గురువారం సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపం కారణాంగా 250 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. లోపాన్ని సరిచేసేందుకు అధికారులు, సిబ్బంది ప్రయతిస్త్రున్నారు.