Saturday, 14 November 2026

వార్తలు

హైకోర్టులో మంత్రి పార్థసారధికి ఊరట

హైదరాబాద్‌: మంత్రి పార్థసారధికి హైకోర్టులో ఊరట లభించింది. నాంపల్లి ఆర్ధిక నేరాల కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చింది. గతంలో మంత్రికి రెండు నెలల జైలు, ఐదు లక్షల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. విచారణ పూర్తయ్యే …

ముగిసిన ‘ ట్విన్నింగ్‌ ప్రోగ్రాం-2012’

రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌లో అబ్దుల్లాపూర్‌మెట్‌: మెరుగైన విద్యా ప్రమాణాలే లక్ష్యంగా రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌, సింగపూర్‌కు చెందిన యూనిటీ సెకండరీ స్కూల్‌లు సంయుక్తంగా ‘ ట్విన్నింగ్‌ కార్యక్రమం – 2012 ‘ నిర్వహించాయి. కార్యక్రమంలో భాగంగా రమాదేవి పాఠశాల…

పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం ఉండాలి: సోనియా

సూరజ్‌కుండ్‌: 2009 ఎన్నికల హామీల అమలుపై మరింత దృష్టి సారించాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతలకు పిలుపునిచ్చారు. హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో ప్రారంభమైన పార్టీ మేధోమథన సదస్సులో సోనియా ప్రసంగించారు. పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం ఉండాలన్నారు. ఇప్పటివరకూ…

విజయవాడలో సీపీఎం ఆందోళన

విజయవాడ: జిల్లాలోని మెట్రోషోరూం ఎదుట సీపీఎం కార్యకర్తలు శుక్రవారం ఉదయం ఆందోళనకు దిగారు. విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తూ వారు  నిరసన వ్యక్తపరుస్తున్నారు.

వైసీపీ కేంద్ర పాలక మండలి భేటీ

హైదరాబాద్‌:  వైఎస్‌ఆర్‌ పార్టీ కేంద్ర పాలక మండలి, ఎమ్మెల్యే, ఎంపీలు శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. తుపాను భీభత్సం, ప్రభుత్వ చర్యలపై వారు చర్చించనున్నట్లు తెలుస్తోంది, ప్రజల్లోకి వెళ్లే అంశంపై ఈ సమావేశంలో జగన్‌ పార్టీ నిర్ణయం తీసుకునే…

గాలి బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా

హైదరాబాద్‌: ఓబులాపురం గనుల కేసు నిందితుడు గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ విచారణను సీబీఐ కోరు ఈ నెల 16కు వాయిదా వేసింది. బెయిల్‌ పిటీషన్‌ పై కౌంటర్‌ దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరడంతో ఈ వాయిదా…

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్‌: నగరంలోని మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి, 24 క్యారెట్ల 10 గ్రామల బంగారం ధర రూ. 31,900గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ,30,300గా ఉంది. కిలో వెండి 60,900 గా…

డిసెంబర్‌ 9న యడ్యూరప్ప కొత్త పార్టీ

కర్ణాటక: డిసెంబర్‌ 9న కొత్త పార్టీ పెడుతున్నట్లు యడ్యూరప్ప ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో కొత్త పార్టీ పెడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో తమ పార్టీ ఎమ్మెల్యేలు వలన బాట పడతారని బీజేపీ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

కేజ్రీవాల్‌ తాజా లక్ష్యం ఎవరో ?

ఢిల్లీ : అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సామాజిక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ తాజాగా ఎవరి గుట్టు విప్పబోతున్నారనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం మధ్యాహ్నం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు మొదలయ్యాయి.…

సూరజ్‌కుండ్‌లో కాంగ్రెస్‌ మేధోమథనం

ఢిల్లీ : కాంగ్రెస్‌ మేధోమథనం సదస్సు ఢిల్లీకి సమీపంలోని సూరజ్‌కుండ్‌లో శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులు, పార్టీ శాశ్వత ఆహ్వానితులు, కేబినెట్‌ మంత్రులతో సహా మొత్తం 75 మంది అగ్రనేతలు పాల్గొంటున్నారు. 2014 ఎన్నికలకు…