Saturday, 14 November 2026

వార్తలు

కుంగిన గజాలఖానా వంతెన

పాలకొండ: భారీ వర్షాలతో పశ్చిమగోదావరి జిల్లా పాలకొండ- పార్వతీపురం రహదారిలో గజాలఖానా వంతెన కుంగిపోయింది, దీంతో ఈ మార్గంలో పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయాయి. మండలంలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో 2 వేల ఎకరాల్లో వరి, చెరకు, అరటి…

‘నీలం’ పై రఘువీరా సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న నీలం తుపాను ప్రభావంపై విపత్తు నిర్వహణ శాఖ మంత్రి రఘువీరారెడ్డి ఉన్నతాధికారులతో సచివాటయంలో సమీక్షంచారు. అన్ని ప్రభుత్వ శాఖలను  సమన్వయం చేసుకుంటూ వరద అంచనాపై ఎప్పటి కప్పుడు నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి…

వలాసలో 10 ఇళ్లు నేలమట్టం

కాశిబుగ్గ: నీలం తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ మండలంలో 10 ఇళ్లుగోడలు కూలి నేలమట్టమయ్యాయి. మందసలో నాలుగు, పలాస, కాశీబుగ్గల్లో ఆరు ఇళ్లు కూలాయి. భారీ వర్షాల కారణంగా గ్రామీణ ప్రాంత రహదారులు కోతకు గురయ్యాయి. పంట,…

మోహన్‌బాబుపై కేసు నమోదు

హైదరాబాద్‌: కోర్టు ఆదేశంతో మోహన్‌బాబుపై మల్కాజ్‌గిరి పోలీసులు కేసునమోదు చేశారు. ‘ దేనికైనా రెడీ ‘ సినిమా వివాదంపై విష్ణు, బ్రహ్మానందం, దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డిలపై కేసు నమోదు చేశారు.

దురంతో, గరీబ్‌రథ్‌ రైళ్లు రద్దు

సికింద్రాబాద్‌: భారీ వర్షాల  కారణంగా సికింద్రాబాద్‌ నుంచి విశాఖ వెళ్లాల్సిన దురంతో, గరీబ్‌రథ్‌ రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

విశాఖ-పెందుర్ది రహదారిలో నిలిచిన రాకపోకలు

వేపగుంట (విశాఖ): భారీ వర్షాలతో విశాఖ జిల్లా వేపగుంట మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయామయ్యాయి. స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో వరద ఉద్థృతికి రోడ్డు కూరుకుపోయింది. దీంతో విశాక- పెందుర్తి రహదారిలో సుమారు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

సహాయం కోసం 5 వేల మంది ఎదురుచూపు

విశాఖపట్నం: విశాఖ జిల్లా మునగపాక మండలంలో కనపర్తి, చూసుకొండ, మెలిపాక, యాదగిరిపాలెం గ్రామాలు జలదిగ్భందంలో ఉన్నాయి. 5 వేల మంది బాధితులు సహాయం కోసం రెండు రోజులుగా ఎదురుచూస్తున్నారు.

నాగంతో బీజేపీ నేతల సమావేశం

హైదరాబాద్‌: ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మధ్యాహ్నం 12 గంటలకు నాగం జనార్థన్‌రెడ్డితో బీజేపీ నేతలు సమావేశం కానున్నారు. కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ, లక్ష్మినారాయణలు నాగంను బీజేపీలోకి ఆహ్వానించనున్నట్లు సమాచారం.

బ్రహ్మనందరెడ్డి బెయిల్‌ నిరాకరించిందిన హైకోర్టు

హైదరాబాద్‌: జగన్‌ ఆస్తుల కేసులో విచారణ ఖైదిగా ఉన్న బ్రహ్మనందరెడ్డికి బెయిల్‌ ఇవ్వడానకి హైకోర్టు నిరాకరించింది. నిందితులు బయట ఉంటే సాక్షాధారాలు మారుతాయన్న సీబీఐ వానదలతో కోర్టు ఏకీభవించింది.

ముఖ్యమంత్రి తో కేంద్ర మంత్రి కోట్ల భేటీ

హైదరాబాద్‌: క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులపై చర్చించినట్లు సమాచారం.