కోర్టులో లొంగిపోయిన విమలక్క
హైదరాబాద్: దారిసుంకం వసూలు కేంద్రం దహనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విమలక్క కోర్టులో లొంగిపోయారు. గురువారం ఉదయం రాజేంద్రనగర్ కోర్టులో ఆమె లొంగిపోయారు.
హైదరాబాద్: దారిసుంకం వసూలు కేంద్రం దహనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విమలక్క కోర్టులో లొంగిపోయారు. గురువారం ఉదయం రాజేంద్రనగర్ కోర్టులో ఆమె లొంగిపోయారు.
బోబ్బిలి విజయనగరం జిల్లాలోని బోబ్బిలి మండలంలో జగన్నాధపురం గ్రామం వద్దమినీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి.
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో జలవిహార్ వద్ద అలాయ్- బలాయ్ కార్యక్రమం ప్రారంభమైంది. భాజపానేత దత్తాత్రేయ ఆధ్వర్యంలో దిన్నీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.
కాగజ్‌నగర్: కాగజ్‌నగర్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర, బాలికల ఓపెన్ ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో కాపింయింగ్ పాల్పడుతున్న 18 మంది విద్యార్థులను డీఈవో అక్రముల్లాఖాన్ డిబార్ చేశారు. రాజనీతి శాస్త్రం పరీక్ష జరుగుతుండగా జిల్లా విద్యాధికారి…
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మాన ప్రసాదరావు గురువారం ఉదయం నాంపల్లిలోని సీబీఐ కోర్టులో హాజరయ్యారు.
వాషింగ్టస్: 2012 సంవత్సరానికిగాను హోవర్ పురస్కారాన్ని ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిన్ వ్యవస్థాపకులు ఎస్, ఆర్. నారాయణమూర్తి అందుకున్నారు. మానవాళికి అత్యుత్తమ సేవలందించిన ఇంజినీర్లకు ఈ పురస్కారాన్ని అందిస్తారు.
హైదరాబాద్: నేడు పలు కంపెనీల బోర్డు సమావేశాలు జరగనున్నాయి. వాటి వివరాలు.. గ్రాన్యూల్స్ ఇండియా , నవభారత్ వెంచర్స్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ , మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఎలక్ట్రికల్స్,…
హైదరాబాద్: నగరంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించనున్నారు. కార్లకు ఫిలిం, ఎటువంటి స్టిక్కర్లు, బొమ్మలు అంటించినా చర్యలు తప్పవంటున్నారు. ఈ మేరకు నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించనున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం…
హైదరాబాద్: దసరా సెలవు అనంతరం గురువారం స్టాక్‌మార్కెట్లు స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 31 పాయింట్లు లాభంతో మొదలైంది, ఆయిల్ అండ్ గ్యాస్, లోహ, రియాల్టీ షేర్లు లాభపడ్డాయి.
హైదరాబాద్: ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఉదయం 6 గంటల నుంచి అక్కడ 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు నగర కమిషనర్ అనురాగ్‌శర్మ తెలియజేశారు.