Friday, 13 November 2026

వార్తలు

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియన్‌ ధరలు  ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,540…22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 30,490గా ఉంది. మార్కెట్‌లో కిలో వెండి ధర రూ 59,800గా…

22న చలో రాజోలు: తెలంగాణ జేఏసీ పిలుపు

హైదరాబాద్‌: తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాకే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణలో అడుగు పెట్టాలని తెలంగాణ రాజకీయ జేఏసీ హెచ్చరించింది,అంత వరకు సీమాంధ్ర బాబు తెలంగాణలో పర్యటన జరిపేదిలేదని తేల్చిచెప్పింది. ఈమేరకు ఈ నెల 22న ‘చలో రాజోలు’…

భారత్‌-చైనా యుద్ధ అమర వీరులకు తొలిసారి నివాళి

ఢిల్లీ: భారత్‌-చైనా యుద్ధంలో అమరులైన జవాన్ల స్మృతి చిహ్నం వద్ద కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఆంటోనీ సైనికాధికారులతో కలిసి శ్రద్థాంజలి ఘటించారు. 1962లో జరిగిన ఈ యుద్ధంలో వీర మరణం పొందిన వారికి ప్రభుత్వం తరపున నివాళులు…

పాల్వంచ కేటీపీఎస్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం: పాల్వంచ కేటీపీఎస్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఏడవ యూనిట్‌లో ఏర్పడిన సాంకేతిక లోపంతో 120 మెగావాట్ల విద్యుదుత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోపాన్ని సరిదిద్దేందుకు నిపుణులు రంగంలోకి దిగారు.

జమ్మూకాశ్మీర్‌లో సుమో బోల్తా.. నలుగురి మృతి

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లోని ఉద్దమ్‌పూర్‌ జిల్లా చెవానిలో సుమో బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

విఠల్‌రెడ్డి మృతిపట్ల కేసీఆర్‌ సంతాపం

హైదరాబాద్‌: సీపీఐ కురు వృద్ధుడు. పేదల  పక్షపాతి, మాజీ ఎమ్మెల్యే చిలుముల విఠల్‌రెడ్డి (98) మృతిపట్ల టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నట్టు ఆయన ఒక…

ఆజాద్‌తో తెలంగాణ మంత్రుల భేటీ

ఢిల్లీ: కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్‌తో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు. ఆజాత్‌తో మంత్రులు జానారెడ్డి శ్రీధర్‌బాబు, సారయ్యలు సమావేశమై చర్చిస్తున్నారు.

విషం కక్కేందుకే సినిమా తీపిండ్రు:జగదీశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమంపై విషం కక్కేందుకే ‘కెమెరామెన్‌ గంగాతో రాంబాబు’ సినిమా తీశారని టీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి జగధీశ్వర్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలనే కుట్రతోనే ఈ సినిమా తీశారని ఆయన దుయ్యబట్టారు. రాంబాబు సినియాను వెంటనే నిలిపివేయాలని…

మావోయిస్టుల దుశ్చర్య.. పట్టాలు తప్పిన గూడ్స్‌

విశాఖ: కొత్తవలస-కిరండోల్‌ మార్గంలో మావోయిస్టులు పట్టాలను తొలగించారు. దీంతో కాములూరు సమీపంలో గూడ్స్‌ రైటు పట్టాలు తప్పింది. గూడ్స్‌ రైలు నుంచి ఇంజిన్‌, మూడ్‌ బోగీలు విడిపోయాయి. ఈ ఘటనతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనాస్థలికి…

సీపీఐ సీనియర్‌ నేత విఠల్‌రెడ్డి కన్నుమూత

నర్సాపూర్‌ (మెదక్‌): సీపీఐ సీనియర్‌ నేత సిహెచ్‌. విఠల్‌రెడ్డి నర్సాపూర్‌లో కన్నుమూశారు. అన్నార్యోగంతో ఆయన తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1962 నుంచి ఐదుసార్లు నర్సాపూర్‌ శాసనసభ్యుడిగా విఠల్‌రెడ్డి గెలిచారు. ఆయన మృతికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ…