Wednesday, 11 November 2026

వార్తలు

ఆర్టీఏ అధికారుల పేరుతో వసూళ్లు

వరంగల్‌: తొర్రూరు మండలం బొడ్లాడ వద్ద నలుగురు వ్యక్తులు ఆర్టీఏ అధికారుల పేరుతో వసూళ్ళకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ముగ్గురు…

ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం వికటించి విద్యార్థి మృతి

హైదరాబాద్‌: అమీర్‌పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం వికటించి జేఎన్‌టీయూ పరిశోధన నరేంద్రకుమార్‌ చావ్లా మృతిచెందాడు. వూబకాయ శస్త్రచికిత్స విఫలమవడంతో మృతిచెందినట్లు సమాచారం. జేఎన్‌టీయూ ఐఎన్‌టీ బయోటెక్నాలజీలో ఇటీవలే నరేద్రకుమార్‌ శిక్షణ పూర్తిచేశాడు.

మూడు రోజుల్లోగా టీ 20 టిక్కెట్ల డబ్యులు చెల్లింపు: వీడీసీఏ

విశాఖపట్నం: వర్షం కారణంగా రద్దైన భారత్‌-న్యూజిలాండ్‌ టీ 20 మ్యాచ్‌ టికెట్లకు సంబంధించిన డబ్బును మూడు రోజుల్లోగా చెల్లిస్తామని వీడీసీఏ ప్రకటించింది. మ్యాచ్‌ టికెట్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని వీడీసీఏ  ప్రెసిడెంట్‌ విష్ణుకుమార్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఎక్కడ…

రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ది సధ్యమవుతుంది

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై కేంద్రానికి మరోమారు లేఖ ఇచ్చే విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఆపార్టీ రాయలసీమ నేత కాల్వ శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్ర సమైక్యంగా ఉండాలన్నదే తమ ప్రగాడ కోరిక అని, ఇందులో…

బాపట్లలో సమైక్యాంధ్ర మహాసభ:గాదె

హైదరాబాద్‌: తెలుగు మాట్లాడే వారంతా కలిసి ఉండాలని కోరుతూ త్వరలో గుంటూరు జిల్లా బాపట్లలో మహాసభ ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌నేత, మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి ప్రకటించారు. తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతూ 1913లో…

నిమ్స్‌ ఆసుపత్రిని ప్రముఖ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు కృషి:ఆజాద్‌

హైదరాబాద్‌: నిమ్స్‌ ఆసుపత్రిని దేశంలోనే ప్రముఖ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేయనున్నట్లు కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్‌ తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ నిమ్స్‌ ట్రామాకేర్‌లో మెరుగైన వైద్యసేవల కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. రూ.125కోట్ల వ్యవయంతో…

నీటి విడుదలపై ప్రభుత్వం ప్రకటన చేయాలి: తెదేపా

గుంటూరు: ప్రభుత్వం నీటి విడుదలపై  వెంటనే ప్రకటన చేయాలని తెదేపా ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు,దూళిపాళ్ల  నరేంద్ర డిమాండ్‌ వ్యక్తం చేశారు. పంట విరామం ప్రకటించినా… హైకోర్టులో సరైన వాదనలు వినిపించకపోయినా ఉద్యమం  చేపట్టనున్నట్లు పేర్కొన్నారు, ఈ నెల 13…

10న ఆటోడ్రైవర్ల సమ్మె

హైదరాబాద్‌: ఆటోడ్రైవర్ల సమస్యలపై తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ ఐకాస ఈనెల 10న అర్థరాత్రి నుంచి ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చింది. హైదరాబాద్‌ నగరంలో 20 వేల కొత్త ఆటోలకు అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో…

70 ఇసుక లారీల పట్టివేత

విజయవాడ: కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ముప్పాల వద్ద కృష్ణానది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 70 లారీలను అధికారులు పట్టుకున్నారు.గత కొన్ని రోజులుగా కృష్ణానది నుంచి అక్రమంగా ఇసుకను హైదరాబాద్‌ తరలిస్తున్నారు. దీంతో సమాచారమందుకున్న అధికారులు లారీలను…

రాష్ట్రం అవినీతిలో కూరుకుపోవడానికి కారణం వైఎస్సే: సోమిరెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రం అవినీతిలో కూరుకుపోవడానికి కారణం వైఎస్సేనని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. దేశాన్ని మన్మోహన్‌సింగ్‌, రాష్ట్రాన్ని వైఎస్‌ఆర్‌ అవినీతిమయం చేశారని ఆయన ఆరోపించారు. వైఎస్‌ పాలనలో చెప్పుకోదగినది అవినీతి కుంభకోణాలే తప్ప మరొకటి లేదన్నారు. ప్రజల…