Wednesday, 4 November 2026

రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ది సధ్యమవుతుంది

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై కేంద్రానికి మరోమారు లేఖ ఇచ్చే విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఆపార్టీ రాయలసీమ నేత కాల్వ శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్ర సమైక్యంగా ఉండాలన్నదే తమ ప్రగాడ కోరిక అని, ఇందులో మరో ఆలోచన కానీ, మరో ప్రతిపాదనకానీ తమకు లేదన్నారు. సమైక్యంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ది సధ్యమవుతుందన్నారు. తెలంగాణ విషయంలో తమ పార్టీ 2008లోనే అభిప్రాయం ప్రకటించిందని, కేంద్రానికి లేఖ కూడా ఇచ్చిందని గుర్తుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *