Tuesday, 10 November 2026

వార్తలు

రుసుముల చెల్లింపులపై నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలి: నారాయణ

మెదక్‌: ఇంజినీరింగ్‌ బోధనా రుసుం అంశంపై ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీనీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్‌ వ్యక్తం చేశారు. తెలంగాణ పోరు యాత్రలో భాగంగా మెదక్‌ జిల్లాలో  నారాయణ  పర్యటిస్తున్నారు. పేద విద్యార్థులపై ఫీజు…

ఈ రోజు సాయంత్రం రాష్ట్ర కేబినెట్‌ సమావేశం

హైదరాబాద్‌: ఈ రోజు సాయంత్రం రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ భేటీలో విద్యుత్‌ సంక్షోభం, ఫీజు రియంబర్స్‌మెంట్‌, ఇందిరమ్మబాటలపై చర్చంచనున్నట్లు సమాచారం.

శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ప్రారంభం

కర్నూలు: రెండు నెలల విరామం తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు పవర్‌హౌస్‌లో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. శ్రీశైలం కుడిగట్టు కేంద్రంలో 2, ఎడమ గట్టు కేంద్రంలో 2 యూనిట్లలో ఉత్పత్తిని ప్రారంభించారు. 834 అడుగుల నీటిమట్టం తర్వాతే విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని…

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 71 పాయింట్లు నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 29 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది.

వర్షంతో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

రామగుండం: భారీ వర్షం కారణంగా రామగుండం- 3,ఓసీపీ -1,2 గనుల్లోకి నీరు చేరింది. దీంతో 15 వేల టన్నుట బొగ్గు ఉత్పత్తి నలిచిపోయిందని అధికారులు తెలియజేశారు.

కరీంనగర్‌లో తెలంగాణ ప్రజా పోరుయాత్ర

కరీంనగర్‌: సీపీఐ చేపట్టిన తెలంగాణ ప్రజాపోరు యాత్ర ఖమ్మం జిల్లాలో ప్రారంభమై ఇప్పటికే తెలంగాణ నాలుగు జిల్లాల్లో కొనసాగింది. ఈ రోజు నుంచి కరీంనగర్‌లో కొనసాగుతోంది. నాలుగు రోజుల పాటు సీపీఐ యాత్ర జిల్లాలో సాగుతుందని ఆ పార్టీ…

జేఎన్‌టీయూ పరిధిలో పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: బంద్‌ కారణంగా జేఎన్‌టీయూ పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలు రేపటికి వాయిదా పడ్డాయి. బీటెక్‌, బీఫార్మసీ పరీక్షలు సెప్టెంబర్‌ 4 కు వాయిదా వేసినట్లు యూనివర్సిటీ ఆధికారులు తెలియజేశారు.

రామగుండం ఎన్టీపీసీలో సాంకేతిక లోపం

గోదావరిఖని: రామగుండం ఎన్టీపీసీ ఒకటో యూనిట్‌లో శుక్రవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 200 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఉదయం కురిసిన భారీ వర్షానికి భావిస్తున్నారు. వెంటనే రంగంలోకి నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.

మాచర్లలో బంద్‌ ఉద్రిక్తం

మాచర్ల: విద్యుత్‌ కోతలు నిరసనగా గుంటూరు జిల్లా మాచర్లలో వైకాపా చేపట్టిన బంద్‌ ఘర్షఫ వాతావరణానికి దారితీసింది. బంద్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు నిరసనగా పోలీసులతో వైకాపా కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.…

బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌

బెంగళూరు: భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన కివీస్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. హైదరాబాద్‌లో తొలి టెస్టును గెలిచుకొని రెట్టింపు ఉత్సాహంతో టీం ఇండియా ఉండాగా… భారత్‌…