Monday, 9 November 2026

వార్తలు

ఐఎంఏ సమావేశంలో తెలంగాణ నినాదాలు

వరంగల్‌ : జిల్లాలోని కాకతీయ మెడికల్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) సమావేశంలో తెలంగాణ నినాదాలు మార్మోగాయి. డాక్టర్‌ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి ఐఎంఏ అధ్యక్షులుగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్‌…

మంత్రి నాగేందర్‌ వీధిరౌడిలా ప్రవర్తిస్తున్నారు: సీపీఐ నేత నారాయణ

హైదరాబాద్‌: మంత్రి దానం నాగేందర్‌ వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. సమస్య ఉంటే మంత్రి వర్గంలో చర్చించాలి కానీ, దేవాలయాలకు తాళం వేయడం ఏంటి అని ప్రశ్నించారు. కేసుల్లో ఉన్న మంత్రులందరిని మంత్రి వర్గం…

లోయలో పడ్డ బస్సు: 20 మంది దుర్మరణం

హిమచల్‌ప్రదేశ్‌: చంబా సమీపంలో ఓ బస్సు అదుపుతప్పి లోయలోపడింది. ఈ ప్రమాదంలో 20 మంది దుర్మరణం చెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. చంబా నుంచి మణిమహేష్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డ వారిని…

మిర్యాలగూడెంలో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

నల్లగొండ: మిర్యాలగూడెంలో ఇంటర్‌ విద్యార్థి మట్టపల్లి మురళీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫీజు కట్టలేదని లెక్చరర్‌ కళాశాల నుంచి బయటకు పంపించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుడు మురళీ దామరచర్ల మండలం…

3 లక్షల ఎర్రచందనం పట్టివేత

మైదుకూర్‌, కడప: దువ్వూరు మండలం మనేరాంపల్లె వద్ద అక్రమ రవాణాకు సిద్థంగా ఉన్న 30 ఎర్ర చందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ 3 లక్షల ఉంటుందని తెలియజేశారు. ఎర్రచందనాన్ని అలవీక్షత్ర…

వీహెచ్‌ ఆధ్వర్యంలో సామాజిక న్యాయంపై సదస్సు

హైదరాబాద్     వీహెచ్‌ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం అనే అంశంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు శనివారం సదస్సును నిర్వహిస్తున్నారు. గాంధీభవన్‌లోని ప్రకాశం హాలులో మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రారంభమయ్యే ఈ సదస్సుకు కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ఎస్‌,…

ఎల్‌ఎల్‌బీ పరీక్షలు వాయిదా

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఈ నెల 13న జరగాల్సిన ఎల్‌ఎల్‌బీ పరీక్షలను వాయిదా వేస్తునట్లు కంట్రోలర్‌ ప్రొ. భిక్షమయ్య తెలిజేశారు. సోమవారం గ్రూప్‌-2 పరీక్ష ఉన్నందున 3, 5ఏళ్ల ఎల్‌ఎల్‌బీ పరీక్షలను వాయిదా వేస్తునట్లు అన్నారు. పరీక్షలను…

నేటి నుంచి గ్రూప్‌ -4 పరీక్షలు

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్‌-4 పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం శని, ఆదివారాల్లో ఏపీపీఎస్సీ నిర్వహించనున్న ఈ పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణ కోసం ఏపీపీఎస్సీ…

పురాతన పంచలోహ విగ్రహం చోరీ

పీలేరు: చిత్తూరు జిల్లా ముడుపులవేముల పంచాయతీ తానాఒడ్డెపల్లి సమీపంలోని ఓదేటి ఎల్లమ్మ ఆలయంలో పురాతన పంచలోహ విగ్రహం చోరీకి గురైంది. దీని విలువ రూ.15 లక్షలు ఉంటుందని ఆలయ సిబ్బంది తెలియజేశారు. నిన్న రాత్రి గుడిలోకి ప్రవేశించిన దుండగులు…

నేడు తెదేపా పొలిట్‌బ్యూరో భేటీ

హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణ పై తెదేపా నేడు కీలక నిర్ణయం ప్రకటించనుంది. ఈ అంశం ప్రధాన అజెండాగా పార్టీ పొలిట్‌బ్యురో సమావేశం కానుంది. ఇప్పటికే పార్టీలో ఎస్సీ వర్గీకరణపై వివిధ వర్గాల నేతలు తమ అభిప్రాయాలను అధ్యక్షుడు చంద్రబాబునాయుడు…