Monday, 9 November 2026

వార్తలు

గ్రూపు-4 పరీక్షా పత్రం లీకైందంటూ అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్‌: రామాంతపూర్‌లోని ఎస్సీ డిగ్రీ కళాశాలలో గ్రూపు-4 పరీక్షా పత్రం లీకైందంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు ఎవరూ స్పందించలేదు. పేపర్‌ లీక్‌ విషయంపై మరిన్ని వివరాలు తెలియలేదు.

ఎస్సీ వర్గీకరణకు తెలుగుదేశం పూర్తి మద్దతునిస్తుంది:బాబు

హైదరాబాద్‌:  ఎస్సీ వర్గీకరణకు తెలుగుదేశం పూర్తి మద్దతునిస్తుందని, పోలీట్‌ బ్యూరో సమావేశ అనంతరం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్రం వెంటనే రాజ్యాంగా సవరణ చేయాలని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం…

నల్లధన కుబేరుల జాబితాలో జగన్‌కి స్థానం: సోమిరెడ్డి

హైదరాబాద్‌: దేశంలో నల్లధన  కేబేరుల జాబితాలో స్థానం కోసం తెలుగువాడైన జగన్‌ పోటీ పడుతున్నాడని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. దేశ వ్యాప్తంగా 49 వేల కోట్ల రూపాయలు  నల్లధనం ఉందని అధికారింగా ప్రకటిస్తే ఒక్క జగన్‌…

టీడీపీ పొలిట్‌బ్యూరోకు సీమాంధ్ర నేతల డుమ్మా

హైదరాబాద్‌: చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న పొలిట్‌బ్యూరో సమావేశానికి సీమాంధ్ర  నేతలు డుమ్మా కొట్టారు. సమావేశంలో తెలంగాణ అంశం, ఎస్సీ వర్గీకరణపై ప్రధానంగా చర్చించడంతోనే సమావేశానికి డుమ్మా కొట్టినట్లు సమాచారం. ఏడుగురిలో ఐదుగురు తెలంగాణకు చెందినవారే. సీమాంధ్ర నేతలు డమ్మా…

కేసీఆర్‌ చెప్తున్నది బోగన్‌ ట్రస్ట్‌: మోత్కుపల్లి

హైదరాబాద్‌: అమరవీరుల కోసం కేసీఆర్‌ పెడతానంటున్న ట్రస్ట్‌ బోగన్‌ అని తెదేపా సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.కేసీఆర్‌ను తెలంగాణ అబద్ధాల కోరుగా అభివర్ణించారు. తెలంగాణాకు టీడీపీ కట్టుబడే ఉందని మరోమారు స్పష్టం చేసిన ఆయన అవసరమైతే మరోమారు…

భౌగోళికంగా విడిపోవటమే మిగిలింది: హరీష్‌రావు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రజలు మానసికంగా విడిపోయారని, భౌగోళికంగా విడిపోవటం ఒక్కటే మిగిలిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. తెలంగాణ భవిన్‌లో తెలంగాణ ల్యాబ్‌ టెక్నిషీయన్‌ యూనియన్‌ ఏర్పాటు సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలోని అన్ని సంఘాలు విడిపోయాయని తెలియజేశారు.…

ఆటో బోల్తా: 8 మంది విద్యార్థులకు గాయాలు

హైదరాబాద్‌: మలక్‌పేటలోని టీవీ టవర్‌ వద్ద ఓ పాఠశాల ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో  8 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఉప రాష్ట్రపతిగా ప్రమాణస్వికారం చేసిన అన్సారీ

న్యూఢిల్లీ: రెండో సారి ఉప రాష్ట్రపతిగా హమీద్‌అన్సారీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి యూపీఏ మిత్ర పక్షాల నాయకులు, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హాజరయ్యారు. 75 ఏళ్ల అన్సారీ 14వ ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.…

జూరాలకు భారీగా చేరుతున్న వరద నీరు

మహబూబ్‌నగర్‌:  జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టులో నిటి మట్టం 316 మీటర్లకు చేరింది. దీంతో దిగువ  ప్రాంతాల ప్రజలను అధికారులు  అప్రమత్తం చేశారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నిటిమట్టం…

ముఖ్యమంత్రి కిరణ్‌ ప్రాంతీయ పక్షపాతి: కేటీఆర్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాంతీయ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆరోపించారు. సీమాంధ్ర ప్రాజెక్టులకు గ్యాస్‌ కోసం ఢిల్లీపై దండయాత్ర చేస్తారు కానీ, తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో లేఖలు కూడా రాయరని ధ్వజమెత్తారు. పార్టీ అంతర్గత కుమ్ములాటలతో…