Monday, 9 November 2026

వార్తలు

అస్సాం అల్లర్లపై సీబీఐ విచారణ

న్యూఢిల్లీ: రాజ్యసభలో కేంద్ర హోంశాఖమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే మాట్లాడుతూ అలర్లపై సీబీఐ విచారణ ప్రారంభమయిందని వెల్లడించారు. అస్సాంలోని కొక్రాఝర్‌ జిల్లాలో జరిగిన అలర్లపై ప్రభుత్వం సీబీఐ విచారణకు అదేశించడాన్ని భాజపా స్వాగతించింది. ఇప్పటికే అల్లర్లు జరిగిన ప్రాంతల్లో సీబీఐ…

త్రిపురాంతకేశ్వరస్వామి దేవాలయంలో డీజీపీ పూజలు

త్రిపురాంతకం: ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వరస్వామి, బాల త్రిపురాసుందరి దేవిలను రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి సతీసమేతంగా పూజలు జరిపారు. దేవస్థాన సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.

స్టాక్‌మార్కెట్‌ నష్టాలతో ముగిసింది

ముంబాయి: జూన్‌లో పారిశ్రామిక ఉత్పత్తి ఆశించినస్థాయిలో లేకపోవడం స్టాక్‌మార్కెట్‌పై ప్రభావాన్ని చూపడంతో మార్కెట్‌ నష్టాలతో ముగిసింది. ఎయిర్‌టెట్‌ ప్రకటించిన ఫలితాలు నిరాశజనకంగా ఉండటంతో ఆ సంస్థ షేర్లు 6.40 శాతం తాగ్గాయి. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీల షేర్ల…

ఇసుక అక్రమార్కులపై కేసులు నమోదు చేయాలి

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని శారదానదిలో అక్రమంగా ఇసుకను తరటించిన వారిపై పీడీ యాక్టు ప్రకారం కేసులు నమోదుచేయాలని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఓడరేవులు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులకు ఆదేశించారు. ఇసుక…

గీతాపకోడ్‌ ఓటమి

లండన్‌: ఒలింపిక్స్‌లో 55 కేజీల ఫ్రీ రెజ్లింగ్‌లో భారత రెజ్లర్‌ గీతాపకోడ్‌ ఓటమి పాలయ్యారు. మొదటి రౌండ్‌లోనే కెనడాకు చెందిన రజ్లర్‌ వీర్‌బీక్‌ చేతిలో ఓడిపోయారు.

ఆఫీస్‌ ముందు ఆందోళన

నెల్లూరు: జిల్లాలోని అక్షయ గోల్డ్‌ కార్యాలయం ముందు ఏజెంట్లు డిపాజిట్‌దారులు ఆందోళనకు దిగారు. బాండ్ల గడువు ముగిసినా కూడా సొమ్ము ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. కాగా నిర్వాహకులు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు.

ముంబాయి ఘోర అగ్ని ప్రమాదం

ముంబయి: తారాదేవ్‌ ప్రాంతంలోని ఎంరెస్టు అపార్ట్‌మెంట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. భయంతో భవంతి నుంచి పరుగులు తీశారు. ఎనిమిది ఫైరింజన్లు మంటలు…

ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధం: మధుయాష్కి

హైదరాబాద్‌: ఫీజు రియంబర్స్‌మెంట్‌ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై కాంగ్రెస్‌ ఎంపీ మధు యాష్కీ మండి పడ్డారు. నాలుగైదు రోజుల్లో ఫీజు రియింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం దిగిరాక పోతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమని ఆయన చేప్పారు.…

యమునా ఎక్స్‌ప్రెస్‌ రహదారి ప్రారంభం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నొయిడా నుంచి ఆగ్రావరకు నిర్మించిన 165 కి.మీ. యమునా ఎక్స్‌ప్రెస్‌ రహదారిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ ప్రారంభించారు. ఈ మార్గంలో న్యూఢిల్లీ నుంచి ఆగ్రాకు చేరుకునేందుకు కేవలం రెండు గంటల సమయం…

టూరిజం క్యాలెండర్‌ విడుదల

హైదరాబాద్‌: రాష్ట్రంలోని యాత్రా విశేషాలతో రూపొందించిన క్యాలెండర్‌ను పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్‌ ఆవిష్కరించారు. రాష్ట్ర పర్యాటక శాఖ వేడుకల సందర్భంగా ఈ క్యాలెండర్‌ను విడుదల చేశారు చారిత్రక ప్రాంతాలను  సందర్శించేవారికి రాష్ట్రంలోని వివిధ పర్యాటక స్థలాలపై…