Monday, 9 November 2026

వార్తలు

1982 విద్యాచట్టం సవరణ ఆర్డినెన్స్‌కు గవర్నరు ఆమోదం

హైదరాబాద్‌: 1982 విద్యా చట్టం 2008 సాంకేతిక విశ్వవిద్యాలయాల చట్టం సవరణ ఆర్డినెన్స్‌కు గవర్నరు ఆమోదముద్ర వేశారు. తాజా ఆర్డినెస్స్‌ ద్వారా ఇంజినీరింగ్‌, వృత్తివిద్యా కళాశాలలపై ప్రభుత్వ ప్రత్యేక్ష పర్యవేక్షణ పెరగనుంది.

మంత్రివర్గ ఉపసంఘం సమావేశం వాయిదా

హైదరాబాద్‌: బోధన రుసుము చెల్లింపులు, ఫీజు విధానంపై ఈ సాయంత్రం జరగాల్సిన మంత్రివర్గ  ఉపసంఘ సమావేశం వాయిదా పడింది. ఫీజు ఎంతో తెలియకుండా ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ తేదిలను ప్రకటించడం వల్ల తలెత్తే ఇబ్బందుల పై సర్కారు ఇప్పటికే న్యాయసలహ…

లోక్‌పాల్‌ బిల్లు ఈ సమావేశాల్లోనే చర్చకు రావచ్చు

ఢిల్లీ: లోక్‌పాల్‌ బిల్లు నివేదికపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పవన్‌కుమార్‌ బన్సల్‌ అన్నారు. సెప్టెంబరు 3 కల్లా సెలెక్ట్‌ కమిటీ నివేదిక అందుతుందని తాము భావిస్తున్నామని, ఆది అందితే కనక ఈ సమావేశాల్లోనే చర్చ ఉంటుందని బన్సల్‌ తెలియజేశారు.…

గాలి బెయిల్‌ కేసులో నిందితులను రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: ఓఎంసీ కేసు నిందితుడు గాలి జనార్దనరెడ్డి బెయిల్‌ కేసులో మాజీ జడ్జీలు పట్టాభి రామారావు, చలపతిరావులకు ఏసీబీ కోర్టు ఈ నెల 17 వరకు రిమాండ్‌ పొడిగించింది. రౌడీషీటర్‌ యాదగిరికి కూడా ఈ నెల 17 వరకు…

కలుషిత నీటితో 46 మందికి అస్వస్థత

కర్ణాటక: ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక సరిహద్దు గ్రామమైన పావగడలో కలుషితమైన నీరుతాగి 46 మంది విద్యార్థినులు అస్వస్థత  పాలయ్యారు. ఇక్కడి కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న బాలికలు కలుషిత నీరు తాగటంతో వారికి వాంతులు. విరేచనాలు అయ్యాయి. చికిత్సకోసం వారిని సమీప…

న్యాయస్థానాన్నీ తప్పుదోవ పట్టించారు: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: జగన్‌ మీడియా సంస్థలు న్యాయస్థానాన్ని సైతం తప్పుదోవ పట్టించాయని, సీబీఐ సీజ్‌ చేసిన  ఖాతాలను కాకుండా వేరే ఖాతాలను జగన్‌ సంస్థలు నిర్వహిస్తున్నాయని తెలుగుదేశం నేత రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. తప్పుడు సమాచారం కారణంగానే జగన్‌ సంస్థలకు…

వికలాంగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి

గుంటూరు: వికలాంగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో  వికలాంగులు చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. వికలాంగులకు మెరుగైన సహాయం అందించే అంశాన్ని తమ మేనిఫెస్టోలో ప్రవేశ పెడతామని…

మంత్రి నాగెందర్‌పై కేసు నమోదు

హైదరాబాద్‌: మంత్రి దానం నాగెందర్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తన విధులకు ఆటంక కలిగించి తనను దుర్భాషలాడాడని బంజారాహిల్స్‌ ఎస్సై రమేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు సీఐ తెలియజేశారు.

పార్థసారిథి ఎన్నికల అఫిడవిట్‌ కేసు విచారణ జరుగుతోంది

విజయవాడ: మంత్రి పార్థసారిథి ఎన్నికల అఫిడవిట్‌ కేసు విచారణ కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ తెలియజేశారు. ఫెరా కేసు వివరాలు అఫిడవిట్‌లో లేకపోతే సెక్షన్‌ 125 (ఎ) ప్రకారం కోర్టుకు వెళ్తామని ఆయన అన్నారు. ఈ…

రాజ్‌భవన్‌ ముట్టడించిన టీఎస్‌ఎన్‌ఎఫ్‌: నేతల అరెస్టు

హైదరాబాద్‌: ఫీజు రీయంబర్స్‌మెంట్‌ యథాతధంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీఎస్‌ఎస్‌ఎఫ్‌ను ముట్టడించింది. ప్లకార్డులు, నినాదాలతో విద్యార్థి సంఘం నేతలు  రాజ్‌భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఈలోగా పోలీసులు అడ్డుకోవడంతో గేటు ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు. విద్యార్థులందరికీ ఫీజు…