Monday, 9 November 2026

వార్తలు

రాతపరీక్ష ఫలితాలు వెల్లడి

హైదరాబాద్‌: కార్మిక ఉపాధి శిక్షణ శాఖలో సహాయ శిక్షణ అధికారుల రాతపరీక్ష ఫలితాలను ఏపీపీఎస్‌సీ ప్రకటించింది. 157 మంది అభ్యుర్థుల వివరాలను ఏపీపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. వీరికి ఆగస్టు 23 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కమిషన్‌ పేర్కొంది.

పార్లమెంటు లో సమావేశాలు

ఢల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు బుధవారం నుంచీ ప్రారంభం కానున్నాయి. ఎప్పటిలాగే ధరల పెరుగుదల, ఆర్ధిక మందగమనం, కరువు తదితర సమస్యలతో పాటు అస్సాం అల్లర్లు కొత్తగా చేరాయి. ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వుద్ధం జరిగే అవకాశం…

ఉపరాష్ట్రపతిగా హమీద్‌ అన్సారీ విజయం

ఢిల్లీ: ఉప రాష్ట్రపతిగా యూపీఏ అభ్యర్ధి హమీద్‌ అన్సారీ విజయం సాధించినట్లు లోక్‌ సభ సెక్రెటరీ జనరల్‌ విశ్వనాధన్‌ ప్రకటించారు. 490 ఓట్లతో అన్సారీ ప్రత్యర్థి జశ్వంత్‌సింగ్‌ పై విజయం సాధించారు. అన్సారీకి 490 ఓట్లు రాగా జశ్వంత్‌సింగ్‌కు…

చేనేత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి:కార్మికసంఘం డిమాండ్‌

హైదరాబాద్‌:  రాష్ట్రంలో చేనేత కార్మికుల అభివృద్దికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చేనేత కార్మిక సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం పట్టించుకొవటంలేదని, రాధానిలో జరిగిన రాష్ట్ర సదస్సులో సంఘం నేతలు అన్నారు. చేనేత…

ప్రభుత్వ అసమర్థత వల్లే గ్యాస్‌ తరలింపు: నాగేశ్వరరావు

ఢిల్లీ :ప్రభుత్వ అసమర్థత వల్లే రత్నగిరికి గ్యాస్‌ తరలిపోతోందని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జైపాల్‌ రెడ్డి రాష్ట్రానికి ఏ విధమైన న్యాయం చేయలేదని, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కప్పిపుచ్చడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన…

ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తానని 20లక్షలతో ఉడాయించిన వ్యక్తి

హైదరాబాద్‌:  కూకట్‌పల్లి, నిజాంపేట్‌ ప్రాంతాల్లో ఇళ్లు ఇప్పిస్తానని ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడినాడు. 20మంది నుంచి రూ.లక్ష చోప్పున వసూలు చేసి, వసూల్‌ చేసిన డబ్బులను తీసుకుని ఉడాయించాడని బాధితులు పేర్కొన్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాష్ట్రంలో అట్టడుగున విద్యాప్రమాణాలు: జేపీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు అట్టడుగు స్థాయికి పడిపోయాయని, ప్రమాణాలు పాటించని విద్యాసంస్థలను జాతీయం చేయాలని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. సమస్యను పక్కదోవ పటించేందుకే బోధన రుసుం విషయంలో ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని, ప్రస్తుత ఫీజు…

స్కూల్‌ ఆటో బోల్తా ముగ్గురికి తీవ్రగాయాలు

ఆదిలాబాద్‌: బెల్లంపల్లిలోని అశోక్‌నగర్‌లో స్కూల్‌ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులను సమీప ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల తల్లి దండ్రులు తీవ్ర ఆందోళనకు గరవుతున్నారు.

వరంగల్‌లో పుస్తెలతాడు లాక్కెల్లిన ఆటోడ్రైవర్‌

వరంగల్‌: జల్లా కేంద్రంలో ఆటోలో ఎక్కిన మహిళ మెడలోంచి పుస్తలతాడు ఆటో డ్రైవర్‌ లాక్కెళ్లాడు. బాధితురాలు రేగొండ మండలం నిజాంపల్లి చెందిన పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యాజమాన్య నిర్లక్ష్య ధోరణితో కార్మికులకు ఇబ్బందులు

హైదరాబాద్‌: తమ వేతనాల నుంచి రికవరీ చేసిన మొత్తాన్ని ఆర్టీసీ సీసీఎస్‌కు వెంటనే పంపించాలని ఏపీఎస్‌ ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ డిమాండ్‌ వ్యక్తం చేసింది. యాజమాన్య  నిర్లక్ష్య ధోరణితో 13 వేల మంది కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని యూనియన్‌…