Monday, 9 November 2026

వార్తలు

ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ సుదర్శన్‌ ఆచూకి లభ్యం

ఊపిరిపీల్చుకున్న పోలీసులు, కార్యకర్తలు బెంగళూరు, ఆగస్టు 3 : ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ సుదర్శన్‌ క్షేమం.. ఊపిరి పీల్చుకున్న మంత్రులు, పోలీసులు, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు. శుక్రవారం ఉదయం నజారాబాద్‌లోని తన సోదరిని ఇంటి నుంచి మార్నింగ్‌ వాక్‌కు వెళ్లడం,…

నల్లగొండలో రాంకీ డంపింగ్‌యార్డును పెట్టనీయం

నల్లగొండ: జిల్లాలో రాంకీ డంపింగ్‌యార్డును పెట్టనీయమని జేఏసీ చైర్మన్‌ ప్రొ. కొదండరాం తెలిపారు. జిల్లాలోని ప్రైవేటు కంపెనీలల్లో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కృష్ణా నది తీరంలో యురేనియం ప్రాజెక్టు చేపడితే ప్రటల ఆగ్రహానికి…

మెదర్‌ జిల్లాలో వృద్ధ దంపతుల హత్య

మెదక్‌: అల్లాదుర్గం మండలం మొప్పారంలో దారుణం జరిగింది. వృద్ధ దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం.

యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం

అనంతపురం: యశ్వంత్‌పూర్‌ – కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో హిందూపురంలో 2 గంటలుగా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. గుంతకల్‌ నుంచి మెకానిక్‌లు రావాలని రైల్వే అధికారులు పేర్కున్నారు. ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

నృత్యానికి కొత్త హంగులు

హైదరాబాద్‌: భారతీయ సంప్రదాయ నృత్యరీతులకు ఆధునిక హంగులు అద్ది నవరసాల మేళవింపుగా హైదరాబాదులో సాగిన నృత్యం ప్రదర్శన ఆకట్టుకుంది. యూఎన్‌కు చెందిన బ్రిగమ్‌ యంగ్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులు నగరంలో ప్రదర్శించిన వలక్షణమైన నృత్యాశాలు రంజింపజేశాయి. ఫాస్ట్‌బీట్‌కు అనుగుణంగా ప్రతి…

కన్నకొడుకే కాలయముడై

హైదరాబాద్‌: శుక్రవారం మధ్యాహ్నం ప్రశాంత్‌నగర్‌ రోడ్‌ నెం.3లో కమలమ్మ (75)తో ఆమె కుమారుడు వినోద్‌ మద్యం మత్తులో గొడవపడ్డాడు. ఈ సమయంలో అతను ఆమెను ఇంట్లో ఉన్న మంచినీటి సంపులోకి తోసేశాడు. అనంతరం సమీప కాలనీలోని సోదరి ఇంటికి…

కేటీపీఎన్‌ 11వ యూనిట్లో సాంకేతిక లోపం

ఖమ్మం: రాష్ట్రంలో మరోసారి విధ్యుత్తు సమస్య తలెత్తింది. ఖమ్మం కేటీపీఎన్‌ 11వ యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 550 మెగావాట్ల విధ్యుదుత్పత్తికి అంతరాయమేర్పడింది. సాంకేతిక లోపం సరిచేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

వృద్ధుడి సజీవదహనం

నిజామాబాద్‌: కామారెడ్డి మండలం లింగాపూర్‌ గ్రామంలో ఈరోజు రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో లక్ష్మయ్య అనే వృద్ధుడు సజీవదాహనమయ్యాడు. లక్ష్మయ్య ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో విద్యుదాఘాతం సంభవించి గుడిసె అంటుకోవడంతో ఈప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

అథ్లెటిక్స్‌ ఓవరాల్‌ ఛాంప్‌ విజయవాడ సర్కిల్‌

విజయవాడ స్పోర్ట్స్‌: ఇందిరాగాందీ మున్సిపల్‌ స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన ఏపీ ట్రాన్స్‌కో అండ్‌ ఆస్కం ఇంటర్‌ అథ్లెటిక్‌ ఛాంపియన్‌ షిప్‌లో విజయవాడ ఆపరేషన్స్‌ నర్కిల్‌ 33 పాయింట్లతో ఓవరాల్‌ చాంప్‌ను కైవసం చేసుకుంది. పోటీల ముగింపు…

ఇద్దరు మావోయిస్టుల అరెస్టు

ఖమ్మం: ఖమ్మం జిల్లా చర్ల మండలం చలమల అటవీ ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టులు, ముగ్గురు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు తుపాకులు, మందుగుండు సామగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకన్నారు.