Sunday, 8 November 2026

వార్తలు

తెలంగాణకు అప్పుడు వైఎస్‌..ఇప్పుడు జగన్‌ అడ్డు

కరీంనగర్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ వినోద్‌ మండిపడ్డారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు అడ్డుపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను అప్పుడు తండ్రి అడ్డుకుంటే, ఇప్పుడు అక్రమ సంపాదనతో జగన్‌ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణకు…

గాంధీభవన్‌లో ఫోటో పెట్టేంత ప్రత్యేకత ఏమీ కన్పించడం లేదు

హైదరాబాద్‌: గాంధీభవన్‌ వైఎస్‌ ఫోటో పెట్టేంత ప్రత్యేకత తనకేమీ కన్పించడం లేదని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింగా అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఎంతో మంది ముఖ్యమంత్రులయ్యారని వైఎస్‌ హయాంలో తీసుకున్న నిర్ణయాలే అనేకం వివాదాస్పదమయ్యాయని ఆయన అన్నారు. తన దృష్టిలో…

మాజీ మంత్రికి చంద్రబాబు పరామర్శ

పశ్చిమగోదావరి: అనారోగ్యంతో చికత్స పొందుతున్న మాజీ మంత్రి సీహెచ్‌వీపీ మూర్తి రాజును తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఈరోజు పరామర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో మూర్తిరాజు చికిత్స పొందుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టరుకు గాయాలు

ఎచ్చెర్ల: శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌ గౌర్‌  రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బుధవారం మధ్యాహ్నం ఎచ్చెర్ల మండలం సనపలవాలనిపేట సమీపంలో జాతీయ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న ట్రాక్టరు ఢీకొనడంతో కలెక్టరు సౌరభ్‌ గౌర్‌కు గాయాలయ్యాయి.…

కరెంటు షాక్‌తో దంపతుల మృతి

ఖమ్మం: ఖమ్మం జిల్లా ములకలపల్లి మండలం చింతలపాడులో విద్యుదాఘాతంతో దంపతులిద్దరూ మృతిచెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. తీగలపై బట్టలు ఆరేస్తుండగా కరెంటు షాక్‌ కొట్టి భార్య మృతించెందగా ఆమెను కాపాడబోయి భర్తకూడా మృత్యువాత పడ్డాడు.

డెక్కన్‌ క్రానికల్‌ అధినేతపై చీటింగ్‌ కేసు నమోదు

హైదరాబాద్‌: డెక్కన్‌ క్రానిక్‌ పత్రిక అధినేత వెంకట్రామిరెడ్డిపై సీసీఎస్‌ పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు.  కార్వీ సంస్థ ప్రతినిధులు ఆయనపై ఫిర్యాదు చేయడంతో ఐపీసీ సెక్షన్‌ 420, 468, 406, 417 ప్రకారం పోలీసులు అభియోగాలు నమోదు…

ఉత్తర, తూర్పు ఈశాన్య గ్రిడ్లలో విద్యుత్‌ పునరుద్దరణ

ఢిల్లీ: ఉత్తర, తూర్పు ఈశాన్య గ్రిడ్లలో అధికారులు పూర్తిస్థాయిలో విద్యుత్‌ సరఫరాను పునరుద్దరించారు. ఐదు ప్రాంతాల్లోనూ నూరు శాతం విద్యుత్‌ సరఫరా పునరుద్దరించినట్లు ప్రధాన పంపిణీ సంస్థ ప్రకటించింది. సోమవారం అర్థరాత్రి ఉత్తరాది గ్రిడ్‌ వైఫల్యంతో మొదలైన విద్యుత్‌…

అడవుల దీవి నుంచి సీపీఐ రైతు పోరుబాట ప్రారంభం

గుంటూరు: గుంటూరు జిల్లా అడవుల దీవినుంచి సీపీఐ పోరుబాట ప్రారంభించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వాన్‌పిక్‌ ఒప్పందాలు పూర్తిగా రద్దుచేసి రైతులకు భూములు అప్పగించాలన్నారు. వాన్‌పిక్‌ భూముల్ని ఆయన ట్రాక్టర్లతోదున్నారు.

జయశంకర్‌ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి

హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతిని తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్‌ చేసింది.  జయశంకర్‌ జీవిత చరిత్రను విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్చాలని కూడా తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్‌ చేసింది.

కరువు ప్రాంతాల్లో పర్యటనకు బయల్దేరిన కేంద్ర మంత్రులు

ఢిల్లీ: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌ పవార్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్‌లు కరువు ప్రాంతాల్లో మూడు రోజుల పర్యటనకు గాను ఈరోజు బయల్దేరారు. ఈరోజు మధ్యాహ్నం ముంబాయిలో ముఖ్యమంత్రి పృధ్వీరాజ్‌ చవాన్‌తో భేటీ కానున్న…