Sunday, 8 November 2026

వార్తలు

ఏసీబీకి చిక్కిన ఖమ్మం టీపీఎస్‌

ఖమ్మం పురపాలకం: ఖమ్మం పట్టణ టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ రాజేంద్రప్రసాద్‌ మంగళవారం ఏసీబీకి రెండ్‌ హ్యాండెడ్‌గా దొరికాడు. స్థానిక రాపర్తి నగర్‌లోని భవన నిర్మాణానికి సంబంధించి రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ డీఎస్పీ జనార్థన్‌ బృందానికి దొరికిపోయాడు. అతన్ని బుధవారం…

92పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబాయి: రిజర్వ్‌బ్యాంక్‌ పరపతి విధానంలో ఎలాంటి మార్పులు లేకపోవడం అంతర్జాతీయంగా అనుకూల ఫలితాలతో మంగళవారం స్టాక్‌మార్కెట్‌ లాభాలనార్జించింది. సెన్సెక్స్‌ 92.50పాయింట్ల ఆధిక్యంతో 17236.18వద్ద నేషనల్‌స్టాక్‌ ఎక్సేంజ్‌ 29.20పాయింట్ల లాభంతో 5229 పాయింట్ల వద్ద ముగిశాయి. చమురు గ్యాస్‌, ఐటీ…

కేంద్ర మంత్రి వర్గంలో కీలక మార్పులు

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్‌ ముఖర్జీ స్థానంలో ఇప్పటి వరకు హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పి.చిదంబరంకు ఆర్థికశాఖ అప్పగించారు. చిదంబరంలో స్థానంలో హోం శాఖను సుశీల్‌కుమార్‌ షిండేకే కేటాయించారు.…

భారత్‌ విజయలక్ష్యం 252పరుగులు

కొలంబో: భారత్‌-శ్రీలంక మధ్య జరుగుతున్న నాలుగోవన్డేలో మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 8వికెట్ల నష్టానికి 251పరుగులు చేసి 252పరుగుల విజయలక్ష్యాన్ని భారత్‌ ముందువుంచింది. శ్రీలంక ఆటగాళ్లు థఱ:ఘ 51, దిల్షాన్‌ 42, తిరిమన్నె 47పరుగులు సాధించారు. భారత బౌలర్లలో…

పార్ధసారథి శిక్ష ఉత్తర్వుల నిలుపుదల

హైదరాబాద్‌: ఫెరా ఉల్లంఘన కేసులో రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖమంత్రి పార్థసారధికి విధించిన శిక్ష ఉత్తర్వులను నాంపెల్లి న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. కేపీఆర్‌ టలిప్రొడక్ట్‌ సంస్థకు డైరెక్టర్‌ హోదాలో ఫెరా నిబంధనలు ఉల్లంఘంచినందుకు ఆర్థికనేరాల ప్రత్యేక న్యాయస్థానం మంత్రి పార్థసారధికి…

రామలింగేశ్వరుని సేవలో భన్వర్‌లాల్‌

రంగారెడ్డి/ కీసర: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ కుటుంబసమేతంగా కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామిని సోమవారం దర్వించుకున్నారు. శ్రావణ మాసంలో రెండోవారం స్వామిసన్నిధిలో జరిగే పూజ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చి భన్వర్‌లాల్‌కు ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.…

భద్రేశ్వరాలయంలో సామూహిక లింగాభిషేకం

రంగారెడ్డి: తాండూరులోని భావిగీ భద్రేశ్వరాలయంలో వీరశైవ సమాజం ఆధ్వర్యంలో కాశీ పీఠాధిపతి చేత సామూహిక లింగాభిషేకం నిర్వహించారు. కాశీ జగద్గురు శ్రీశ్రీ చంద్రశేఖర శివాచార్య మహాస్వామి చేతలు మీదుగా సోమవారం సామూహిక లింగాభిషేకం నిర్వహించారు. ఇక్కడి లింగాయతులు తమ…

వేతనాలు చెల్లించాలంటూ కార్మికుల ఆందోళన

రంగారెడ్డి: తాండూరు : పంచాయితీ కార్మికులకు చెల్లించే వేతనాలను ప్రతినెల సక్రమంగా చెల్లించాల్సిందిగా కోరుతూ సోమవారం తాండూరు మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. చెల్లించే అరకొర వేతనాలను సైతం నెలల తరబడి…

విద్యార్థులకు పరీక్షలు

రంగారెడ్డి: పూడూరు మండలంలోని పెద్ద ఉమ్మొన్తల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యరక్ష పథకంలో భాగంగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి అవసరమున్న వారికి చికిత్సలు అందిస్తున్నట్లు డాక్టర్‌ రంగనాధ్‌ తెలిపారు.

పింఛన్లను పునరుద్ధరించాలని వికలాంగుల ఆందోళన

రంగారెడ్డి:తాండూరు: రద్దు చేసిన పింఛన్లను వెంటనే పునరుద్దరించాలని తాండూరు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట వికలాంగులు ఆందోళన చేశారు. ఇంతకుముందు అర్హులను ఎంపిక చేసి ఏళ్లుగా పించన్లు చెల్లించి కొంతకాలంగా రద్దు చేశారని వికలాంగులు కార్యాలయం ముందు బైఠాయించి రిలే…