Sunday, 8 November 2026

వార్తలు

అస్సాంలో పర్యటించనున్న ప్రధాని

ఢిలీ: అస్సాంలో అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ శనివారం పర్యటించనున్నారు. గత ఐదురోజులుగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో చెలరేగిన హింసాకాండ ఫలితంగా నలభై మందికి పైగా మృతి చెందారు. రెండు లక్షల మంది నిరాశ్రయులయ్యారు. సైన్యం అక్కడ…

పార్థసారధికి నైతికవిలువుంటే రాజీనామా చేయాలి:సీపీఐ

వరంగల్‌:సీపీఐ రాష్ట్ర కార్యాదర్శి నారాయణ వరంగల్‌లో మాట్లాడుతూ మంత్రి పార్థసారధికి నైతిక విలువుంటే రాజీనామా చేయాలని డిమాండ్‌  వ్యక్తం చేశారు. కళంకిత మంత్రులను వెంటనే తొలగించాలని అన్నారు. రాష్ట్రాన్ని  మధ్యం,మైనింగ్‌, మందుల మాఫియాలు శాశిస్తున్నాయని ఆయన అన్నారు.

ప్రభుత్వాన్ని ప్రక్షాలన చేయాలి

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మాజి మంత్రి దామోదర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీని, ప్రభుత్వాన్ని కూడా ప్రక్షాలన చేయాలని, మంత్రుల కమీటీ సీనీయర్ల అభిఆప్రాయాలు తీసుకోలేదని అన్నారు. తెలంగాణకు సీఎం పదవి ఇచ్చినంత మాత్రానా ప్రత్యేక డిమాండ్‌ ఆగదని…

వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ ఘెరావ్‌

వరంగల్‌: వరంగల్‌ జిల్లా కలెక్టరును గ్రామస్థులు ఘెరావ్‌ చేశారు. జిల్లాలోని హాన్మకొండ మండలం కడిపికొండలో అతిసార  వ్యాపించడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. వ్యాధి తీవ్రంగా ప్రబలినా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఈ రోజు ధర్నాకు దిగారు. ఈ…

కాల్‌ జాబితా కేసులో కేవీ రెడ్డికి ఆగస్టు 6వ తేదీ వరకు రిమాండ్‌

హైదరాబాద్‌: సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కాల్‌జాబితా కేసులో కె.వి. రెడ్డిని పోలీసులు ఈ రోజు సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. సీఐడీ న్యాయస్థానం అతనికి ఆగస్టు 6వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది.

శ్రీశైలం హుండీ ఆదాయం రూ.1.20 కోట్లు

శ్రీశైలం:శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో హుండీ ఆదాయాన్ని ఈ రోజు లెక్కించారు. రూ. 1.20 కోట్ల నగదు, 135 గ్రాముల బంగారం స్వామివారికి భక్తులు కానుకగా చెల్లించినట్లు అధికారులు తెలియజేశారు.

గాలి బెయిల్‌ కేసులో నిందితుల రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: గాలి జనార్థన్‌ రెడ్డి బెయిల్‌ కేసులో నిందితులైన జడ్జీలు ప్రభాకరావు, లక్ష్మీనరసింహారావులను అధికారులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వారిద్దరికీ న్యాయస్థానం ఆగస్టు 9వ తేదీ వరకు రిమాండ్‌ పొడిగించింది. అధికారులు తిరిగి వారిద్దరినీ చర్లపల్లి జైలుకు తరలించారు.

బొంతలవాగులో ఇద్దరు మహిళలు గల్లంతు

వరంగల్‌ : ములుగు మండలం సర్వాపురం వద్ద బొంతులవాగు దాటుతుండాగా ఇద్దరు మహిళలు గల్లంతుయ్యారు. వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో వారు అదుపుతప్పి ప్రవాహంలో కొట్లుకుపోయారని స్థానికులు తెలిపారు. వారి ఆచూకి కనుగొనడానికి స్థానికులు ప్రయత్నిస్తున్నారు.

తమిళ సంఘసేవకుడికి రామన్‌ మెగసెసె అవార్డు

చెన్నై : ఈ ఏడాది రామన్‌ మెగసెసె అవార్డు విజేతలు ఆరుగురిలో ఒకరు భారతీయులు. చెన్నైకి చెందన కులందై ఫ్రాన్సిస్‌(66) 2012 రామన్‌ మెగసెసె అవార్డుకి ఎంపికైనట్లు నిర్వాహకులు నిన్న మనీలాలో ప్రకటించారు. తైవాన్‌, ఫిలిప్పైన్స్‌, బంగ్లాదేశ్‌, కంబోడియా,…

కర్మాన్‌ఘాట్‌లో పదో తరగతి విద్యార్థి అపహరణ

హైదరాబాద్‌: రాజధానిలోని కర్మాన్‌ఘూట్‌ సమిపంలో పదో తరగతి చదువుతున్న మహేశ్‌ అనే బాలుడు అపహరణకు గురయ్యాడు. తల్లీదండ్రులు సరూర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భూతగాదాల కారాణంగా మహేశ్‌ను అతని బాబాయే కిడ్నాప్‌ చేశాడని ఫిర్యాదులో పేర్కోన్నారు.