Sunday, 8 November 2026

వార్తలు

ప్రధానితో సమావేశమైన పవార్‌

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో ఎన్‌సీపీ కాంగ్రెస్‌ల మధ్య చర్చలు జరిగాయి. చర్చల్లో ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ఎన్‌సీపీతరుపున ఆ పార్టీ అగ్రనేత శరద్‌పవార్‌, ప్రపుల్‌పటేల్‌ పాల్గొన్నారు. పవార్‌ తమ డిమాండ్లను కాంగ్రెస్‌ ముందుంచారు. దీనిపై…

ఆటోను ఢీ కొన్న లారీ…ముగ్గురు మృతి

అనంతపురం: అనంతపురం జిల్లా పెనుకొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గుట్టూర్‌ జంక్షన్‌ వద్ద ఆటోను లారీ ఢీ కొనడంతో సంఘటనస్థలంలోనే ముగ్గురు మృతి చెందగా తీవ్ర గాయాలైన మరో ముగ్గురిని పెనుకొండ ఆసుపత్రికి తరలించారు.

కోర్టు తీర్పును స్వాగతిస్తున్నా:మంత్రి పార్థసారధి

హైదరాబాద్‌:కోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని మంత్రి పార్థసారాది అన్నారు. కేపీఆర్‌ టెలి ప్రోడక్ట్స్‌ కేసులో మంత్రి పార్థసారధికి ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు మంత్రికి రెండు నెలల సాధారణ జైలు శిక్ష విదించింది. మంత్రి ఫెరా ఉల్లంఘనకు పాల్పడినట్లు కోర్టు…

అన్న దీక్షకు మద్దతుగా హైదరాబాద్‌లో దీక్షలు

హైదరాబాద్‌: అవినీతి మంత్రులు, ఎంపీలపై చర్య తీసుకోవాలంటూ అన్నా బృందం ఢిల్లీలో చేపట్టిన నిరవధిక దీక్షకు మద్దతుగా ఇండియా ఎగైనెస్ట్‌ కరప్షన్‌ సంస్థ హైదరాబాద్‌ శాఖ ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టింది. కేంద్ర ప్రభుత్వంలో 15మంది మంత్రులు, 163మంది…

ఆనంద బుద్ధ వీహార ట్రస్టుపై విచారణకు ఆదేశం

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని ఆనంద బుద్ధ విహార ట్రస్ట్‌లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ను దీనిపై విచారణ జరిపి నివేదికను రెండు నెలలలోగా సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ట్రస్టు వ్యవస్థాపకుడు సి.అంజనేయరెడ్డి,…

బీవీ మోహన్‌రిడిని పరామర్శించిన చంద్రబాబు

హైదరాబాద్‌: మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన నగరంలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. టీడీపీ  పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఆసుపత్రికి వెళ్లి మోహన్‌రెడ్డిని…

ప్రాజెక్టుల పూర్తి విషయంలో ప్రభుత్వం విఫలం: కడియం

హైదరాబాద్‌: ప్రాజెక్టుల పూర్తి విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ నేత కడియం శ్రీహరి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంకంటే ఆ ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని సొమ్ము చేసుకోవడంపైనే ప్రభుత్వతాపత్రయం ఉందని ఆయన ఆరోపించారు.…

సిరిసిల్లలో మహిళపై దాడిని ఖండిచిన:ఈటెల

కరీంనగర్‌:  సిరిసిల్లలో మహిళలపై సీమాంధ్ర గూండాల దాడిని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ తీవ్రంగా ఖండిస్తూ ఈ దాడిని తెలంగాణలోని మహిళలపై దాడిగా అభివర్ణించారు. తెలంగాణలో ఏ చిన్న  అలజడి జరిగిన వీడియోలను చూసి కేసులు పెడుతారు మరీ…

మద్దికెరలో లారీ బోల్తా

కర్నూలు:  మద్దికెరలో మిని లారీలో గుంతపల్లీకి పెళ్ళీకి వెల్తుండగా టైరుపేలి  బోల్తా పడింది. 50మంది గాయా పడ్డారు. వారిలో పదిమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మంత్రి పార్థసారధికి రెండు నెలల జైలు శిక్ష

హైదరాబాద్‌: కేపీఆర్‌ టెలి ప్రోడక్ట్స్‌ కేసులో మంత్రి పార్థసారధికి ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు మంత్రికి రెండు నెలల సాధారణ జైలు శిక్ష విదించింది. మంత్రి ఫెరా ఉల్లంఘనకు పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో రూ.5లక్షల 15వేల…