ఆర్టీసీ ఆదాయం 12శాతం పెరిగింది. ఎ.కె.ఖాన్
హైదరాబాద్: ప్రైవేటు బస్సులపై ఆర్టీసీ దాడులు చేపట్టడం వల్లఆర్టీసీ ఆదాయం 12శాతం పెరిగిందని ఆర్టీసీ ఎండీ ఎ.కె. ఖాన్ తెలిపారు. ఈ ఏడాదిలో రెండు వేల కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నట్లు ఆయన తెలియజేశారు.
హైదరాబాద్: ప్రైవేటు బస్సులపై ఆర్టీసీ దాడులు చేపట్టడం వల్లఆర్టీసీ ఆదాయం 12శాతం పెరిగిందని ఆర్టీసీ ఎండీ ఎ.కె. ఖాన్ తెలిపారు. ఈ ఏడాదిలో రెండు వేల కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నట్లు ఆయన తెలియజేశారు.
వరంగల్: ఎస్ఐని దుర్భాష లాడిన కేసులో మంత్రి సారయ్య కుమారుడు శ్రీమాన్ ఈ రోజు జిల్లా కోర్టులో లొంగిపోయాడు. అతనికి మంగళవారం హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి విదితమే.
ఖమ్మం: గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద నది నీటిమట్టం 30.5 అడుగులకు చేరింది. పైనుంచి వస్తున్న వరద నీటితో గోదావరి నీటిమట్టం 40 అడుగులకు చేరవచ్చిన అధికారులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్: దక్షిణాఫ్రికాలోని డర్బన్ ప్రాంతానికి విహార యాత్రకు వెళ్లిన సాయిరాంరెడ్డి అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. సాయిరాంరెడ్డి హైదరాబాద్ ఘట్కేసర్కు చెందిన ఇంజినీరీంగ్ విద్యార్థి.
హైదరాబాద్: విద్యుత్ చార్జీలు తగ్గించేంత వరకు ఉద్యమం అగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. పది వామపక్షలు చేపట్టిన చలో సచివాలయం ముట్టడి సంధర్భంగా అరెస్ట్ అయిన రాఘవులును అరెస్ట్ చేసి అబిడ్స్ పోలీసు స్టేషన్కు తరలించారు.…
ముషీరాబాద్: మహిళాకమిషన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళలు స్థానిక ఇందిరా పార్కువద్ద 24 గంటల ధర్నా చేపట్టారు. ఈ కార్యాక్రమానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి,సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ మద్దతు ప్రకటించారు.…
హైదరాబాద్: న్యాయపరమైన సమస్యలను అతి త్వరగా పరిష్కరించాలని మంత్రుల కమిటీ నివేదికలో సూచించినట్లు మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. త్వరలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించామని ఆయన…
న్యూఢిల్లీ: అన్నాహజరే బృందం ఈరోజు ఢిల్లీలోని జంతర్మంత్ వద్ద నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించింది. బలమైన లోక్పాల్ బిల్లును వెంటనే ఆమోదించాలని, మంత్రులపై తాము చేసిన అవినీతి ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరపాలని ఈ బృందం డిమాండ్…
హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు నీటివిడుదల పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టులో కనీస నీటిమట్టం 834 అడుగులు ఉండేలా చూడాలని హైకోర్టు ప్రభుత్వాన్ని అదేశించింది. వారంలోగా ప్రాజెక్టులో నీటిమట్టం పై కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం…
హైదరాబాద్: నాంపెల్లిలోని ఆర్థికనేరాల న్యాయస్థానానికి మంత్రి పార్థసారధి నేడు హాజరయ్యారు. ఫెరా ఉల్లంఘనపై రూ.3 లక్షల జరిమానా చెల్లించలేదని మంత్రిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.ఈ కేసు విషయంలోనే ఆయన ఈ రోజు న్యాయస్థానం ముందు హాజరైనట్లు సమాచారం.