Saturday, 7 November 2026

వార్తలు

ఎన్‌ఎంయూతో ఆర్టీసీ మూడో దఫా చర్చలు

హైదరాబాద్‌: సమ్మె నోటీసు ఇచ్చిన ఎన్‌ఎంయూతో ఆర్టీసీ యాజయాన్యం మూడోదఫా చర్చలు జరిపింది. ఈ నెల 19న యాజమాన్యంతో మరోమారు చర్చలు జరుపుతామని, చర్చల అనంతరం సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని ఎన్‌ఎంయూ నేత నాగేశ్వరరావు తెలిపారు. ఆర్టీసీలో పనిచేస్తున్న…

48 గంటల్లో కోస్తాంధ్ర రాయలసీమల్లో భారీ వర్షాలు

విశాఖపట్నం: రాష్ట్రంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురెసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మరో 48 గంటల్లో రాయలసీమ, కోస్తాంధ్రల్లో పలు చోట్ల, తెలంగాణలో కొన్ని చోట్ల వానలు కురిసే అవకాశం…

నాలుగు గ్రానైట్‌ పరిశ్రమలకు నోటీసులు

ఖమ్మం: ఖమ్మం లోని గ్రానైట్‌ పరిశ్రమలపై విజిలెన్స్‌ అధికారులు ఈ రోజు దాడులు జరిపారు. రికార్డులు సరిగా లేని నాలుగు పరిశ్రమలకు వారు పోటీసులు జారీ చేశారు.

సీఎం కిరణ్‌కు విద్యుత్‌ కొరతపై కేసీఆర్‌ బహిరంగ లేఖ

హైదరాబాద్‌: తెలంగాణలో నెలకొన్న విద్యుత్‌ కొరతపై సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. విద్యుత్‌ కొరతతో తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటుందని పేర్కోన్నారు. తెలంగాణ రైతులకు అదనపు విద్యుత్‌ ఇవ్వకపోగా ఎందుకు…

దొంగనోట్ల ముఠా అరెష్టు

విశాఖపట్నం: విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో దొంగనోట్ల ముఠాకు చెందిన నలుగురిని ఇంటిలిజెన్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 2 లక్షల దొంగనోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో పశ్చిమబెంగాల్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు పోలిసులు అనుమానిస్తున్నారు.

సికింద్రాబాద్‌ అడ్డగుట్టలో దారుణం

హైదరాబాద్‌: సికిండ్రాబాద్‌లోని అడ్డగుట్టలో మంగళవారం రాత్రి దారుణం జరిగింది. ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గుర్తు తెలియని దుండగులు చిన్నారులకు ఉరి వేసి చంపినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నట్లు సమాచారం. చిన్నారుల తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

ట్రైఫెడ్‌ చైర్మన్‌గా సూర్యనాయక్‌

ఢీల్లీ: భారత గిరిజన మార్కెటింగ్‌ సమాఖ్య ట్రైఫెడ్‌ చైర్మన్‌గా ఎం. సూర్యనాయక్‌ నియమితులయ్యారు. చింతపండుతో పాటు 13 ఆటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు చేసట్లనున్నట్లు ట్రైఫెడ్‌ నూతన చైర్మన్‌ ఎం. సూర్యనాయక్‌ తెలిపారు. గిరిజనుల ఆర్థిక…

పర్యటనలో హిల్లరీ క్లింటన్‌ రికార్డు

వాషింగ్టన్‌: అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ పర్యటనలో రికార్డు సృష్టించారు. ఇజ్రాయెల్‌లో ఆమె సోమవారం మాట్లాడుతూ. నాకు ఇక్కడ ఉండటం చాలా ఇష్టం. అయితే నేను వెళ్లాల్సి ఉంది. అని పేర్కొన్నారు. పర్యటన బృందం ఎప్పుడెప్పుడు ఇంటికి…

ఐఎన్‌ఎన్‌కు చేరిన సునీత

హ్యూస్టన్‌: భారత అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎన్‌ఎన్‌ ను చేరుకున్నారు. ఈ కేంద్రంలో వారు నాలుగు నెలల పాటు ఉంటారు. దాదాపు 30 ప్రయోగాలు నిర్వహిస్తారు. సునీతా విలియమ్స్‌తో పాటు రష్యాకు చెందిన…

అక్బరుద్దీన్‌ ఓవైన్‌తో బొత్స సమావేశం

హైదరాబాద్‌: మజ్లీస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇవాళ కలిశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌కు ఓటు వేయాలని అక్బరుద్దీన్‌ను బొత్స కోరారు. బుధవారం జరిగే సీఎల్పీ సమావేశానికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా హాజరుకావాలి బొత్స ఆదేశించారు.