Sunday, 15 November 2026

హైదరాబాద్

తాగునీటి కోసం వెళ్లి విద్యార్థులకు కరెంట్‌ షాక్‌

చిత్తూరు: తాగునీటి కోసం వెళ్లిన పాఠశాల విద్యార్థులు కరెంట్‌షాక్‌కు గురయిన సంఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. కొంగారెడ్డిపల్లి పురపాలక పాఠశాల విద్యార్థులు కొందరు తాగునీటి కోసం వెళ్లగా అక్కడే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ షాక్‌కొట్టి 20మంది గాయపడ్డారు. వీరిని చికిత్స…

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

హంబన్‌టోటా: భారత్‌-శ్రీలంక జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్‌ నేడు ప్రారంభమైంది. తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. అనంతరం పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. 3పరుగలకు గంభీర్‌ ఔటయ్యాడు.

బాలకృష్ణకు బెయిల్‌ నిరాకరణ

డెెహ్రాడూన్‌: బాబా రాందేవ్‌ సహాయకుడు బాలకృష్ణకు సీబీఐ కోర్టు బెయిలు నిరాకరించింది. నకీలి ధృవపత్రాల కేసులో బాలకృష్ణపై నాన్‌ బెయిలబుల్‌ వారెంటు జారీ కావటంతో సీబీఐ అధికారులు నిన్న ఆయనను అరెస్టు చేశారు. ఈ రోజు సీబీఐ కోర్టులో…

రూ. 3 కోట్లతో ఉడాయించిన మహిళ

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ శ్రీకృష్ణనగర్‌లో మహిళ రూ. 3 కోట్లతో ఉడాయించింది. ధనలక్ష్మి ఇంటీరియల్‌ నిర్వాహకురాలు ధనలక్ష్మి లబ్ధిదారులకు చెల్లించాల్సిన రూ. 3 కోట్లు ఎగ్గొట్టి పరారయ్యారు. దీంతో  బాధితులు బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మధ్యాహ్న భోజనం తిని విద్యార్థుల అస్వస్థత

సఖినేటిపల్లి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం గొంది ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని ఏడుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బల్లిపడిన ఆహారం తినడమే దీనికి కారణమని తెలిసింది. బాధితులను సఖినేటిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

గాలి బెయిల్‌ కేసులో నిందితులకు కస్టడీ

హైదరాబాద్‌: గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్‌ వ్యవహారంలో నిందితులు మాజీ జడ్జి లక్ష్మీ నరసింహారావు, సూర్యప్రకాష్‌బాబులను నాలుగు రోజుల ఏసీబీ కస్టడీకి అనుమతి మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వారిని రేపటి నుంచి  అధికారులు విచారించనున్నారు. ఉదయం…

టాస్‌ గెలిచిన భారత్‌

హంబస్‌టోటా: భారత్‌- శ్రీలంక జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్‌ నేడు ప్రారంభమైంది. తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.

విజయమ్మ దీక్షను అడ్డుకోవాలి: కోదండరాం

ఖమ్మం: తెలంగాణాపై స్పష్టత ఇవ్వకుండా వైకాపా నేత విజయమ్మ సిరిసిల్లలో చేనేత కార్మికులకు మద్దతుగా దీక్ష చేపట్టారాదని తెలంగాణ ఐకాస రాష్ట్ర కన్వీనర్‌ కోదండరాం అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రజలు పిలుపునిచ్చారు. ఖమ్మంలో…

రాజధానిలో ఇందిరమ్మబాట

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ బాట కార్యక్రమం ఈ రోజు శేరిలింగంపల్లిలో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన రాజీవ్‌ ఆవాస్‌ పథకాన్ని ఆయన ప్రారంభించారు.

రాష్ట్రంలో 223 మి.మీ వర్షపాతం నమోదు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ రోజు వరకు 223 మి.మీ వర్షపాతం నమోదైందని విపత్తు నిర్వహణ శాఖ డి.డి. రత్నకుమార్‌ తెలిపారు. కోస్తాంధ్రలో సగటు కంటే 12 శాతం, తెలంగాణలో ఒకశాతం అధికంగా నమోదుకాగా రాయలసీమలో 6 శాతం తక్కువగా…