Sunday, 15 November 2026

హైదరాబాద్

విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొన్న కారు…మహిళ మృతి

చిత్తూరు: తమిళనాడులోని తిరుపత్తూరు నుంచి తిరుమల శ్రీవారి దర్శనార్థం 9మంది యాత్రిక బృందంతో బయలుదేరిన కారు బుధవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. భక్తులు ప్రయాణిస్తున్న తవేరా కారు చిత్తూరు జిల్లా చంద్రగిరి శివారులోని రోడ్డు పక్కన ఉన్న విద్యుత్‌…

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ప్రకాశం: క్వారీల నుంచి అక్రమంగా తరలిస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లను రెవెన్యూ, పోలీసు అధికారులు బుధవారం ఉదయం పట్టుకున్నారు. వాహనాలను రెవెన్యూ కార్యాలయానికి తరలించారు. యజమానులకు జరిమానా విధించనున్నట్లు ఉప తహసిల్దార్‌ ప్రభాకర్‌ తెలియజేశారు. ఈ దాడుల్లో ఎస్సై…

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం ఉదయం భక్తులు 29 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 68,509 భక్తులు దర్శించుకున్నారు.

బీసీలకు తెదేపా పై విశ్వాసం ఉంది:రామకృష్ణుడు

విజయవాడ: బీసీలకు తెదేపా పై విశ్వాసం ఉందని ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు  అన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో వారికి 100 సీట్లు ఇచ్చి తీరుతామని ఆయన విజయవాడలో స్పష్టం చేశారు. బీసీ డిక్లరేషన్‌కు మద్దతు కూడగట్టేందుకు…

రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని ఇద్దరి మృతి

హైదరాబాద్‌: శంషాబాద్‌ ఉందానగర్‌ రైల్వేస్టేషన్‌లో ఈ ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

భానుకిరణ్‌ కేసుల పై నేడు ఛార్జిషీటు

హైదరాబాద్‌ : మద్దెలచెరెవు సూరి హత్య కేసులో సీఐడీ అధికారులు బుధవారం ఛార్జిషీటు దాఖలు చేయనున్నారు. 2011 జనవరి 2వ తేదిన జరిగిన సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌ను సీఐడీ ఆధికారులు ఏప్రిల్‌ 21వ తేదిన…

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అన్సారీ నామినేషన్‌ దాఖలు

న్యూఢిల్లీ: యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా హమీదఅన్సారీ నామినేషన్‌ దాఖలు చేశారు. నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలను  ఆయన…. రిటర్నింగ్‌ అధికారి అయిన లోక్‌సభ కార్యదర్శి విశ్వనాథన్‌కు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ,…

బస్సుపై బాంబుదాడి 12 మంది మృతి

ఇస్లామాబాద్‌: షియా ముస్లింలతో వస్తున్న ఓ మినీ బస్సుపై బుధవారం బాంబుదాడి జరిగింది. ఈ దాడిలో 12 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఒరక్జాయి గిరిజన ప్రాంతం స్పాయి. గ్రామం నుంచి షియాలు బస్సులో వస్తుండగా ఈ…

పోలీసు శిక్షణలో అపశ్రుతి

వరంగల్‌: పోలీసు శిక్షణలో అపశ్రుతి చోటుచేసుకుంది. జిల్లాలోని మామునూరు నాలుగో బెటాలియన్‌ పోలీసులకు ఫైరింగ్‌లో శిక్షణ ఇస్తుండగా మిన్‌ ఫైర్‌ అయిముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే వరంగల్‌ ఎంజీఎంకు  తరలించారు. ఘటనపై ఎస్పీ విచారణ చేపట్టారు.

హైదరాబాద్‌లో సంచరిస్తున్న కేరళ నరహంతకుడు

హైదరాబాద్‌: పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న  కేరళ నరహంతకుడు ఆంటోనీ హైదరాబాద్‌లో సంచరిస్తున్నట్లు ఆ రాష్ట్ర పోలీసులు గుర్తించారు. సెల్‌ ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా అతను నగరంలో ఉన్నట్లు గుర్తించిన కేరళ పోలీసులకు సమాచారమందించారు. హంతకుడి కోసం పోలీసులు…