Saturday, 14 November 2026

హైదరాబాద్

ఈనెల 11 నుంచి బెల్లంపల్లి- హైదరాబాద్‌ ఇంటర్‌సిటీ

బెల్లంపల్లి: బెల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు కొత్తగా నడవనున్న ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 11వ తేదీనుంచి ప్రారంభిస్తారని పెద్దపల్లి ఎంపీ వివేకానంద తెలియజేశారు.  రైలు హైదరాబాద్‌లో ఉదయం 5.15 గంటలకు బయల్దేరి పది గంటలకు బెల్లంపల్లి  చేరుకుంటుంది.…

ఏపీపీఎన్‌సీ సమాచార అధికారికి జరిమానా

హైదరాబాద్‌:దరఖాస్తుదారులకు సమాచారం నిరాకరించడంతో పాటు సమాచార కమిషన్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన ఏపీపీఎన్‌సీ సమాచార ఆధికారికి రాష్ట్ర ప్రదాన సమాచార కమిషనర్‌ జరిమానా విదించారు.2007 గ్రూపు 1 పరీక్షకు సంబందించి గుంటూరు జిల్లాకు చెందిన శేఖర్‌బాబు అనే…

మక్కా మసీదు వద్ద సీసీ టీవీలు

హైదరాబాద్‌: రంజాన్‌ కోసం హైదరాబాద్‌ నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మక్కా మసీదు వద్ద సీసీ టీవీలు, మెటల్‌డిటెక్టర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కేంద్ర ఎన్నికల కమిషన్‌కు జగన్‌ లేఖ

హైదరాబాద్‌: కేంద్ర ఎన్నికల  కమిషన్‌కు వైఎస్‌ జగన్‌ లేఖ రాశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో హైదరాబాద్‌లోనే ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని ఎన్నికల కమిషన్‌ను జగన్‌ కోరారు. అక్రమాస్తుల  కేసులో అరెస్టు అయిన జగన్‌ గత కొంతకాలంగా చంచల్‌గూడ జైలులో…

కృష్ణా డెల్టాకు నీటి విడుదల నిలిపివేత

నల్గొండ: నాగార్జున సాగర్‌ నుంచి కృష్ణా డెల్టాకు నీటి విడుదలను అధికారులు నిలిపి వేశారు. కృష్ణా డెల్టా ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నందున తాత్కాలికంగా నీటి విడుదల నిలిపివేసినట్లు అధికారులు తెలియజేశారు.

ఇందిరమ్మబాటపై మంత్రులతో సీఎం సమావేశం

వాస్తవాలు చెప్పి..సంక్షేమ పథకాల కొనసాగింపు హైదరాబాద్‌, జూలై 10 : ఇందిరమ్మ బాటపై చర్చించడానికి రాష్ట్ర మంత్రులతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఉదయం క్యాంప్‌ కార్యాలయంలో భేటీ అయ్యారు. అందుబాటులో ఉన్న మంత్రులు సమావేశంలో పాల్గొన్నారు. మంత్రులు వట్టి…

డిఎస్‌సిని వాయిదా వేయబోం : పార్ధసారధి

హైదరాబాద్‌, జూలై 10 : డిఎస్‌సిని ఎట్టి పరిస్థితుల్లోను వాయిదా వేయబోమని మంత్రి పార్ధసారధి అన్నారు. మంగళవారంనాడు ఒక ప్రకటనలో ఆయన పై విషయాన్ని స్పష్టం చేశారు. ఇదే ఏడాది డిసెంబరులో మరో డిఎస్‌సి నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఆ…

టీడీపీ గుడివాడ సమావేంలో రసబాస

హైదరాబాద్‌: గుడివాడలో టీడీపీ సమావేశం రసబాసగా మారింది. శాసనసభ్యుడు ఎన్టీఆర్‌ సన్నిహితుడు కొడాలి నానీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో కలుసుకున్నాడు.  దీనితో టీడీపీ వెంటనే సస్పెండ్‌ చేసింది. ఈ రోజు ఎంపీ కొణకళ్ల నారయణ…

వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాల్లో భారత్‌ ఒకటి:చిదంబరం

బెంగళూరు:ప్రపంచంలో వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాల్లో ఒకటని కేంద్ర హోంమంత్రి చిదంబరం అన్నారు.ఆర్థిక సంక్షోభ,ద్రవ్యోల్బణం భారత్‌ అభివృద్ధికి ఆవరోధంగా మారాయని ఆయన అన్నారు.మళ్లీ భారత్‌ అభివృద్ది పధంలో దూపుకుపోతుందన్న నమ్మకం ఉందని,టెలికాం వృద్దిలో ప్రపంచంలోనే భారత్‌ రెండో స్థానంలో…

‘తెలంగాణ’పై తక్షణమే తేల్చాలి

ఎమ్మెల్సీ యాదవరెడ్డి హైదరాబాద్‌, జూలై 10 : తెలంగాణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే తేల్చాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ యాదవరెడ్డి కోరారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అంశాన్ని తేల్చకుంటే కాంగ్రెస్‌ పార్టీకి గడ్డురోజులేనని…