Sunday, 15 November 2026

తెలంగాణ

ఓటమిపై జూపల్లి కామెంట్స్…

మహబూబ్‌నగర్: జిల్లాలోని కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జూపల్లి కృష్ణారావు. ఓటమి పాలయ్యారు. తన సమీప ప్రత్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డిపై దాదాపు 3వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఈ సందర్భంగా జూపల్లి విలేకరులతో…

గజ్వేల్‌లో కేసీఆర్‌ విజయం

గజ్వేల్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఘన విజయం సాధించారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో తన సమీప ప్రత్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డిపై 51వేల ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయం సాధించారు. కేసీఆర్‌ విజయం సాధించడంతో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజల పక్షాన పోరాడతాం: రేవంత్‌

కొడంగల్: తెలంగాణ ఎన్నికల ఫలితాల ట్రెండ్ టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ గెలుపు .. తెలంగాణ ఆత్మగౌరవానికి, స్వయం పాలనకు, అభివృద్ధికి విఘాతం కల్గించేలా ఉందన్నారు. ఓడిపోయినా ప్రజా క్షేత్రంలోనే ఉంటానని రేవంత్ చెప్పారు. ఓడిపోతే కుంగిపోమని,…

తుమ్మల నాగేశ్వరరావు ఓటమి

హైదరాబాద్‌: పాలేరు తెరాస అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. తుమ్మలపై కాంగ్రెస్‌ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి కేవలం 1950 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

సిరిసిల్ల కేటీఆర్‌దే!

హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తెరాస ప్రభంజనం కొనసాగుతోంది. సిరిసిల్లలో తెరాస అభ్యర్థి, మంత్రి కేటీఆర్‌ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్‌కు చెందిన సమీప ప్రత్యర్థి కె.కె. మహేందర్‌రెడ్డిపై కేటీఆర్‌ జయకేతనం ఎగురవేశారు. 2009 నుంచి శాసనసభ్యుడిగా…

జానారెడ్డి ఓటమి

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, నాగార్జునా సాగర్‌ ప్రజాకూటమి అభ్యర్థి కె.జానారెడ్డి ఓటమి పాలయ్యారు. జానారెడ్డిపై తెరాస అభ్యర్థి నోముల నర్సింహయ్య ఘన విజయం సాధించారు.

లక్ష దాటిన హరీష్ రావు మెజార్టీ.. 1,06,816

హైదరాబాద్ : తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు.. వరుసగా ఆరోసారి విజయం సాధించారు. లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొంది.. టీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటగా పేరుగాంచిన సిద్దిపేటలో మరోసారి గులాబీ జెండాను రెపరెపలాండిచారు హరీష్ రావు. హరీష్…

 మేం మోసం చేయలేదు: ఎంపీ కవిత

 హైదరాబాద్‌: ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఎలాంటి మోసానికి పాల్పడలేదని అంటున్నారు తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత. ఈరోజు జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో తెరాస ముందంజలో ఉంది. ఈ విషయం గురించి కవిత మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌,…

ఈవీఎంలలో ట్యాంపరింగ్‌ జరిగింది : ఉత్తమ్

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ స్పందించారు. ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఈవీఎంలలో ట్యాంపరింగ్‌ జరిగినట్లు ఉత్తమ్‌ అనుమానం వ్యక్తం చేశారు. వీవీప్యాట్‌ల్లో స్లిప్‌లను కూడా లెక్కించాలని డిమాండ్ చేశారు. కూటమి అభ్యర్థులంతా రిటర్నింగ్‌ అధికారులకు…

ఎల్లారెడ్డి అసెంబ్లి స్థానాన్ని కాంగ్రెస్‌ కైవసం

హైదరాబాద్ : ఎల్లారెడ్డి అసెంబ్లి స్థానాన్ని కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్‌ అభ్యర్థి సురేందర్‌ గెలుపొందారు.