నేడే ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు..

అమరావతి: ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌ ఫలితాలను మంగళవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నరు . ఫలితాలను www.eenadu.netలో పొందవచ్చు. ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్‌ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. దీని ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తారు. సెట్‌ ఛైర్మన్, జేఎన్‌టీయూ-కాకినాడ వీసీ ప్రసాదరాజు తెలిపారు.

ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ రామమోహన్‌రావుతో కలిసి ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఈఏపీసెట్‌ను జేఎన్‌టీయూ- కాకినాడ నిర్వహించింది. మొత్తం 3,62,851 మంది దరఖాస్తు చేయగా.. వారిలో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు.
ఇంజినీరింగ్‌కు సంబంధించి 2,58,373 మంది, వ్యవసాయ, ఫార్మసీ విభాగాలకు కలిపి 80,766 మంది పరీక్షలు రాశారు.