Monday, 2 November 2026

ETCA ఆధ్వర్యంలో షార్జా వేదికగా ఘణంగా 9వ సారి బతుకమ్మ సంబరాలు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌30  (జనంసాక్షి):
* 10వేలమంది భారీ జనసమీకరణ నడుమ తెలంగాణ బతుకమ్మ సాంస్కృతిక వేడుకలు
* కార్యక్రమానికి మన తెలంగాణ రాష్ట్రం నుండి ముఖ్య అథితులుగా పలువురు రాజకీయ నాయకులు హాజరవుతున్నారు
* కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్ గా ప్రముఖ యాంకర్, సినీనటి శ్రీమతి ఉదయభాను గారు మరియు గాయనీ గాయకులు శ్రీ కోకిల నాగరాజు మరియు శ్రీ తేజుప్రియ గార్లు విచ్చేస్తున్నారు
* ETCA మరియు తెలంగాణ జాగృతి మహిళావిభాగం ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
* ఈ కార్యక్రమానికీ హాజరయ్యే వారికోసం ప్రసాదం పంపిణీ తో పాటు తెలంగాణ రుచులతో ప్రత్యేకమైన ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు
* అందమైన మొదటి ఐదు బతుకమ్మలకు, బతుకమ్మ పాటలకు బహుమతులు
* స్కయ్ లైన్ యూనివర్సిటీ, షార్జా  ప్రకృతి రమణీయతల నడుమ భారీ విద్యుత్ కాంతి దీపాల అలంకరణతో, కార్యక్రమాన్ని అందరు తిలకించే విధంగా భారీ స్క్రీన్స్ , సీటింగ్, పార్కింగ్, మ్యూజిక్ సిస్టమ్స్, బతుకమ్మ ఆడే ప్రాంగణము కూలర్లతో ఏర్పాట్లు
* తెలంగాణ  గ్రామీణ జీవన సంస్కృతిని ప్రతిబింబించే మాదిరిగా డప్పు కళాకారుల వేషధారణ , నృత్యాలు
* స్థానిక అతిధులుగా ఇండియన్ కాన్సూలేట్ ప్రతినిధులు మరియు తెలుగు సంఘాల ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు  హాజరవబోతున్నారు
* కార్యక్రమానికి ప్లాటినం  స్పాన్సర్ గా SRR బిల్డింగ్ మెటీరియల్స్ గ్రూప్ అఫ్ కంపెనీస్ , గోల్డ్ స్పాన్సర్ గా LSPMK గ్రూప్ అఫ్ కంపెనీస్ ,  సిల్వర్  స్పాన్సర్ లుగా సూపర్ జెట్  గ్రూప్, జెనరల్ స్పాన్సర్లుగా  GBR   గ్రూప్  , యునిఫోర్స్ కాంట్రాక్టింగ్ , దియార్ అల్  మదీనా టెక్నికల్ సర్వీసెస్, మిలాన్ గ్రూప్, అలైన్స్ హెచ్ఆర్,  ఆశ్రిత్ టెక్నికల్ సర్వీసెస్ , విస్మార్ట్ టెక్నికల్ సర్వీసెస్, ఆర్ట్ అఫ్ స్పయిసెస్ రెస్టారెంట్, ఛాయ్ వాల కేఫ్ కార్యక్రమానికి సహకరిస్తున్నారు
*గత ఎనిమిది సంవత్సరాల నిర్వహించిన తీరు కన్న గొప్పగా తొమ్మిదవ బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నట్టు  దానికి కావలసిన అన్ని ఏర్పాట్లలో కార్యనిర్వాహక  కమిటీ  సభ్యులు కృషి చేస్తునట్టు తెలిపారు.
*బ్రతుకు దెరువు కోసం వచ్చిన మనమంతా కలిసి ఒక కుటుంబంలా పండుగ చేసుకోవడం , రోజు రోజు కి యాంత్రికంగా మారుతున్న మానవ జీవన శైలిలో ఉన్న ఒత్తిడిలను, అలసటను ఇలాంటి వేడుకలు తగ్గిస్తాయని, ఉల్లాసాన్ని , ప్రశాంతతను , సంతోషాన్ని నింపుతాయని ETCA అధ్యక్షులు రాధారపు సత్యం గారు, వ్యవస్థాపకులు కిరణ్ కుమార్ పీచర గారు, ఉపాధ్యాక్షులు అరవింద్ రాగం గారు, మరియు కార్యదర్శి నరేష్ కూమార్ మాన్యం గారు, తెలంగాణ   జాగృతి యూఏఈ  అధ్యక్ష్యుడు సాయి చందర్ కటకం తెలిపారు