చట్టాన్ని వ్యతిరేకిస్తే కఠిన చర్యలే.. : ఆర్మూర్ ఏసిపి బస్వ రెడ్డి
ఆర్మూర్, సెప్టెంబర్ 24 ( జనం సాక్షి): ఆర్మూర్ డివిజన్ పరిధిలోని గ్రామాలలో చట్టాన్ని
చేతిలోకి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆర్మూర్ ఎసిపి బస్వారెడ్డి హెచ్చరించారు. గ్రామాల్లో కుల బహిష్కరణ, గ్రామ బహిష్కరణ, జరిమానాలు వంటి వాటిని సహించేది లేదన్నారు. గ్రామాల్లో ఎలాంటి అవకతవకలు, అల్లర్లు జరిగిన చట్టబద్ధంగా సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లాలని వారన్నారు. గ్రామాల నుండి ఏ ఒక్క వ్యక్తి ఇబ్బందులు ఎదురైన దాని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హితవు పలికారు