కల్తీకల్లు తాగి ఇద్దరు మృతి

విశాఖపట్నం, జనంసాక్షి: కల్తీ కల్లుకాటుకు ఇద్దరు వ్యక్తులు బలయ్యారు. మరో ఎనిమిది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని పీహెసీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జీలుగు మండలం కురుసువెల్లి గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

తాజావార్తలు