Monday, 2 November 2026

ఢాకాలో 9 మంది ఉగ్రవాదులు హతం

dahakaఢాకా: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఢాకాలో ఓభవనంపై దాడిచేసేందుకు యత్నించిన ఉగ్రవాదులను పోలీసులు సమర్థంగా తిప్పికొట్టారు. 10 మంది ఉగ్రవాదులు ఓ భవనంలోని నాలుగో అంతస్థులోకి చొరబడి దాడులకు పాల్పడేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు సోమవారం అర్ధరాత్రి భవనాన్ని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. దీంతో ఉగ్రవాదులు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నాటు బాంబులు విసిరారు. తెల్లవారుజామున ఉగ్రవాదులకు పోలీసులకు మధ్య రెండు గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 9 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్లు ఢాకా డీసీపీ మసూద్‌ అహ్మద్‌ వెల్లడించారు. దాడులకు పాల్పడిన 10 మంది ఉగ్రవాదులు బంగ్లాదేశ్‌కి చెందిన జమయేతుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదసంస్థకు చెందినవారేనని పేర్కొన్నారు. గతంలో ఢాకాని ఓ కెఫెలో కాల్పులకు పాల్పడి 20 మందిని హతమార్చిన వారే మరోసారి మారణహోమం సృష్టించేందుకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *