పనిలోకి తీసుకోవాలని కార్మికుల ఆందోళన

పెందుర్తి : కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని కోరుతూ విశాఖ జిల్లా పొర్లుపాలెం ఆంధ్రా సిమెంట్‌ కంపెనీ వద్ద బుధవారం కంపెనీ కార్మికులు ఆందోళనకు దిగారు. యాజమాన్య వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. మాజీ మంత్రి తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యనారాయణ మూర్తి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. యాజమాన్యం స్పందించి కార్మికుల బకాయిలు చెల్లించి తక్షణం పనిలోకి తీసుకున్నట్లయితే ఆందోళన ఉధ్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికులతో కలిసి ఆయన కంపెనీలోకి చొరబడటానికి యత్నించటంతో పోలీసులు రంగప్రవేశం చేసి వీరిని అడ్డగించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.