వేతనం రూ.12 వేలకు పెంపు 
ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం
హైదరాబాద్, డిసెంబర్5 (జనంసాక్షి) : డిసెంబర్ 6న ¬ంగార్డుల ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి నిత్యం విధుల్లో అంకితభావంతో పనిచేస్తున్న ¬ంగార్డుల పట్ల అత్యంత ఉదారంగా తమ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రకటించారు. దీర్ఘకాలంగా ఉన్న ¬ంగార్డుల డిమాండ్ల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి పలు నిర్ణయాలు ప్రకటించారు. డిజిపి అనురాగ్‌శర్మ, ఐజి (ఇంటలిజెన్స్) శివధర్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి నాగిరెడ్డి తదితరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పనిచేస్తున్న 16 వేల మంది ¬ంగార్డుల వేతనాన్ని రూ.9 వేల నుంచి రూ.12 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది బడ్జెట్ ఇప్పటికే పూర్తయినందున వచ్చే ఏడాది బడ్జెట్‌లో పొందుపరిచి 2015 ఏప్రిల్ మాసం నుంచి పెంచిన జీతాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ¬ంగార్డులకు మెడికల్ ఇన్సూరెన్స్, ఏడాదికి రెండు జతల బట్టలు, హైదరాబాద్, సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో బస్ పాసులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం నెలకు రెండు సార్లు పరేడ్ అలవెన్సు పేరిట ఇస్తున్న రూ.28/-ని 100/-రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.




