అంగన్వాడీ పిల్లలకు ఏకరూప దుస్తులు పంపిణీ చేసిన జడ్పీటీసీ అనిల్ జాధవ్.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పవర్ గ్రీడ్ వారి సౌజన్యంతో అంగన్వాడీ కేంద్రంలోని విద్యార్థిని విద్యార్థులకు నూతన యూనిఫాం దుస్తులు సరఫరా చేస్తోంది.ఇందులో భాగంగా శుక్రవారం రోజున మండలంలోని రాజుర గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు యూనిఫాం డ్రెస్సులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా జడ్పీటీసీ అనిల్ జాధవ్ పాల్గొని వారి చేతుల మిదుగా చిన్నారులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అనిల్ జాధవ్ తోపాటు జిపి సర్పంచ్ జాధవ్ అనసూయ వసంత్ నాయకులు గణేష్ ఉపాద్యాయురాలు మలేశ్వరి అంగన్వాడీ టీచర్ ప్రేమబాయి తదితరులు పాల్గొన్నారు.