ఆషాఢ బోనాలతో తెలంగాణలో పండగ వాతావరణం
గ్రామాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు
హైదరాబాద్,జూలై30(జనం సాక్షి): గోల్కొండ బోనాలతో తెలంగాణ వ్యాప్తంగా మొదలైన ఆషాడ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతన్నాయి. ఆదివారం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు జరిగాయి. అలాగే తెలంగాణ వ్యాప్తంగావంమహిళలు పెద్ద ఎత్తున ఆలయాలకు బోనాలతో చేరుకొని.. నైవేద్యం సమర్పించి.. మొక్కులు చెల్లించుకున్నారు. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో సిఎం కెసిఆర్ దంపతులు, ఎంపి కవిత, మంత్రులు తలసాని ఎనివాసయాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, ఎంపి బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డిలు పాల్గొన్నారు. దోమకొందలో ఎమ్మెల్యే గంప గోవర్దన్ ఆద్వరంలో ఇంటికో బోనం బయలుదేరి అంగరంగ వైభంగా సాగింది. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలకేంద్రంలో ఆషాడమాసం బోనాలు వైభవంగా జరిగాయి. మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి వేడుకలలో పాల్గొన్నారు. ఎల్లమ్మ, మహాంకాళి అమ్మవార్ల ఆలయాలకు వరకు బోనం ఎత్తి.. ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతే.. ఇంత వైభవంగా బోనాల పండుగలను జరుపుకుంటున్నామని భక్తులు చెప్పారు. కరీంనగర్ లో జరిగిన ఆషాడమాసం బోనాలలో మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మేయర్ రవిందర్ సింగ్ లు పాల్గొని.. బోనం ఎత్తుకున్నారు. రాంనగర్ కాలనీతో పాటు నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పె/-దదెత్తున తరలివచ్చి.. అమ్మవారికి నైవేద్యం సమర్పించి.. మొక్కులు తీర్చుకున్నారు. బోనాలతో తరలివచ్చిన మహిళలు, పోతరాజుల నృత్యాలు, డప్పు చప్పుళ్లతో బోనాల పండుగ శోభయమానంగా సాగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలపరిధిలోని దండు మల్కాపురంలో.. బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఆందోళ్ మైసమ్మకు మహిళలు బోనం సమర్పించి.. మొక్కులు చెల్లించు కున్నారు. పాత నల్లగొండ జిల్లా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నుంచి భక్తులు వందలాదిగా తరలివచ్చి.. మైసమ్మను దర్శించుకున్నారు. కోరిన కోర్కెలు తీరాలని.. ఆలయ ప్రాంగణంలోని వేప చెట్టుకు ముడుపులుకట్టారు. స్థానిక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. అమ్మవారిని దర్శించుకున్నారు.ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బోనాల పండుగ ఘనంగా ప్రారంభమైంది. ఆదిలాబాద్ పట్టణంలోని పోచమ్మ ఆలయం, మహాలక్ష్మీ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మహిళలు బోనాలతో పె/-దదెత్తున తరలివచ్చి.. మొక్కులు తీర్చుకున్నారు. అటు ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. ఏర్పాట్తు చేశారు. పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఆషాడమాసం బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. చెరువు కట్టవిూద ఉన్న కాళీమాతకు మహిళలు, శిశ సత్తులు, భక్తులు బోనాలు సమర్పించి.. మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి యేడు
ఆషాడమాసం బోనాలు.. పాత ఇల్లందులో ఘనంగా జరుగుతాయని భక్తులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం బోనాల పండుగ కోసం భారీగా నిధులను సమకూర్చటం సంతోషంగా ఉందన్నారు.
నిర్మల్ పట్టణంలో బోనాల పండుగ వైభవంగా ప్రారంభమైంది. డప్పుల దరువులు, పోతరాజలు విన్యాసాల మధ్య బోనాలతో పె/-దదెత్తున మహిళలు మహాలక్ష్మీ అమ్మవారికి నైవేద్యంను సమర్పిచారు. పట్టణంలో ఉదయం నుంచే బోనాల సందడి షురూ అయింది. రంగారెడ్డి జిల్లాలో ఘనంగా ఆషాడమాస బోనాలు జరిగాయి. ఇబ్రహీంపట్నంలో ని శ్రీమహాంకాళి అమ్మవారికి మహిళలు నైవేద్యం సమర్పించి.. మొక్కులు చెల్లించుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో బోనాల పండుగ వైభవంగా జరిగింది. పోచమ్మ, ఊరడమ్మ అమ్మవారి ఆలయాలకు భక్తులు పె/-దదెత్తున తరలివచ్చి.. బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అటు రాంనగర్ ఆలయానికి మహిళలు భారీగా వచ్చి.. నైవేద్యం సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో ప్రతి యేడు బోనాల పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నామని భక్తులు తెలిపారు.




