– న్యాయంపక్షాన నిలబడిన వారికి ఆపద కలిగించను
– ఈ ఏడాది వానలు సమృద్ధిగా కురుస్తాయి
– ‘రంగం’తో భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత
– భారీగా తరలివచ్చిన భక్తులు
– నేత్రపర్వంగా అంబారీ ఊరేగింపు
– ఈసారి ఏర్పాట్లు ఘనంగా చేశాం – మంత్రి తలసాని
హైదరాబాద్, జులై30(జనం సాక్షి): చారిత్రాత్మక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా సాగాయి. సోమవారం రంగంలో భవిష్యవాణి వినిపించింది. తొలిరోజు బోనాలు, సాక, తొట్టెలు సమర్పించి అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.. సోమవారం రంగం, అంబారీ ఊరేగింపు, సాగనంపుల కార్యక్రమం సాగింది. ఉదయం 11.30గంటలకు స్వర్ణలత అమ్మవారిని ఆవహించుకుని భవిష్యవాణి వినిపించారు.. అమ్మవారి దర్శనానికి తరలివ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు పోటెత్తాయి. రాత్రి నిర్వహించి పలహారం బండ్ల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగానిలిచింది. తు రాజులల వీరంగం.. విచిత్ర వేష ధారణలు.. నృత్యాలు, భక్తజన సందోహం.. అంబారీ ఊరేగింపు.. సాగనంపులతో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు సోమవారం వైభవంగా సాగాయి. అమ్మవారిని దర్శించు కునేందుకు భక్తులు భారులు తీరారు. ఉదయం 11.30గంటల స్వర్ణలతను అమ్మవారి ఆవహించి భవిష్యవాణి చెప్పారు. రాష్ట్రంలో ఈఏడాది సంమృద్ధిగా వర్షాలు కురుస్తాయని స్వర్ణలత అన్నారు.నాకు ముక్కపుడక తెచ్చినవారినే కాక ప్రజలందరినీ ఆశీర్వదిస్తానని, ఎప్పుడూ న్యాయం పక్షానే నిలబడతానని పలికారు. న్యాయం పక్షాన నిలబడిన వారికి ఆపద కలిగించనన్నారు. తన దర్శనానికి ఏటా భక్తులు సంతోషంగా వచ్చేవారని.. ఈ ఏడాది మాత్రం దుఃఖంతో వచ్చారని.. ఈ ఏడాది సమర్పించిన బంగారు బోనం నాకు కొంత సంతోషాన్ని.. కొంత బాధను కలిగించిందని అమ్మవారు పలికారు. నా దర్శనానికి వచ్చే భక్తులను ఇబ్బంది పెట్టొద్దని, ఆడపడుచులందరూ దుఃఖంతో ఉన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి’ అని అమ్మవారు అన్నారు. రంగం అనంతరం దేవాలయం చుట్టూ పోతురాజులు చేసే వీరంగాలు ప్రత్యేక ఆకర్షణగానిలిచాయి. గంభీరమైన శరీరం, ముఖానికి పసుపు, కాళ్లకు మువ్వలు, చేతిలో వీరగోల పెట్టుకొని దేవాలయం చుట్టూ తిరుగుతూ పోతురాజులు చేసిన వీరంగాలు ఆకట్టుకున్నాయి.. అదేవిధంగా అంబారీపై అమ్మవారిని ఉంచి వందలాది మంది భక్తులు వెంటరాగా కోలాటాలు నృత్యాలు, దేవతా మూర్తుల వేషధారణలతో అంబారీ ఊరేగింపు శోభాయమానంగా సాగింది. అమ్మవారి ఘటం ముందు నడువగా అంబారీ ఊరేగింపు మహంకాళి దేవాలయం నుంచి మోండా, అలా/-ప¬టల్ తదితర సికింద్రాబాద్ పురవీధుల గుండా మెటు/-టగూడ వరకు వెళ్లింది. అక్కడే అమ్మవారికి సాగనంపు కార్యక్రమం నిర్వహించారు.
ఈసారి ఏర్పాట్లు ఘనంగా చేశాం – మంత్రి తలసాని
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు గతంలో కంటే ఈ ఏడాది ఏర్పాట్లు ఘనంగా చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రంగం కార్యక్రమం పూర్తయిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. ఈసారి అమ్మవారికి బంగారం బోనం సమర్పించడం చరిత్రాత్మకమని పేర్కొన్నారు. ఆదివారం అమ్మవారి దర్శనం విషయంలో కొందరు భక్తులు అసంతృప్తికి గురైన సంగతి
తమ దృష్టికి వచ్చిందన్నారు. రాజకీయాలకతీతంగా అందరికీ అమ్మవారి దర్శనం కల్పించామన్నారు. ఆలయంలో స్థలాభావం వల్ల కొంత ఇబ్బంది ఎదురైనప్పటికీ.. అన్ని శాఖల సమన్వయంతో బోనాల పండుగను ఘనంగా నిర్వహించామన్నారు. బోనాల పండుగ ఘనంగా జరిగిందని, విదేశీయులు సైతం ఈ సంబరాలకు హాజరయ్యారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందంటూ కొందరు కామెంట్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జోగిని శ్యామల కాస్త ఇబ్బంది పడ్డారని విన్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. లక్షల మంది వచ్చినప్పుడు జరిగిన అసౌకర్యాన్ని ఆమె అర్థం చేసుకోవాలంటూ శ్యామలకు మంత్రి తలసాని సూచించారు. చిన్న చిన్న అసౌకర్యాలు జరిగాయని, స్థలం తక్కువగా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైన మాట వాస్తవమే. వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. స్వచ్ఛంద సంస్థలు బాగా సహకరించాయని మంత్రి తెలిపారు. అయితే జోగిని శ్యామలకు ఆలయ పరిస్థితులు పూర్తిగా తెలుసని, ప్రభుత్వంపై ఆమె కామెంట్ చేయడం సరికాదని అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండి పిల్లాపాపలతో సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి తలసాని ఆకాంక్షించారు.
ఆదివారం ప్రముఖుల సందడి
సికింద్రాబాద్ జనరల్‌బజార్‌లోని ఉజ్జయినీ మహంకాళి ఆలయ బోనాల జాతర ఆదివారం ప్రారంభమైంది. తెల్లవారుజామున 4:05 గంటలకు ఆలయ పూజారులు మహా మంగళహారతితో తొలి పూజను ప్రారంభించారు. పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొలిపూజలో పాల్గొని ఉజ్జయినీ మహంకాళి, మాణిక్యాలమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం తలసాని దంపతులు మహంకాళికి బోనాలు సమర్పించి జాతరను ప్రారంభించారు. బోనాలు సమర్పిం చేందుకు శనివారం అర్ధరాత్రి ఒంటిగంటకే వేల మంది భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయానికి కిలోవిూటర్ల పొడవునా క్యూలైన్లు నిండిపోయా యి. అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రముఖులు, సాధారణ భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబసభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్నారు. వారికి ఆలయ పూజారులు శాస్తోక్త్రంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవార్లకు పూజలు చేసిన తర్వాత బంగారు బోనాన్ని సమర్పించారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఆడపడుచులందరూ దుఃఖంతో ఉన్నారు




