అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా సభ్యులు అరెస్ట్

ముంబయి: డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది. నిందితుల వద్ద నుంచి కిలో కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుపడ్డ కొకైన్ విలువ సుమారు రూ. 6 కోట్లుగా సమాచారం. ఇద్దరిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.